ఇందాఁకా బుద్దిచెప్పితి మించుకంతా వినదాయ
(॥పల్లవి॥)
ఇందాఁకా బుద్దిచెప్పితి మించుకంతా వినదాయ
ముందర నిన్నుఁ గంటానే మోహించె నిదివో
(॥ఇందాఁ॥)
చలము సాదించ వచ్చి సరసమునకుఁ జొచ్చె
అలిగే ననుచుఁ జూచి యాసపడెను
చెలియ నీయెడ కింత చిత్తిణిగుణముదాయ
మలసి నీ వెంత మొకమాయకాఁడవో
(॥ఇందాఁ॥)
కమ్మటిఁ గొర వచ్చి కన్నులనే నిన్ను నవ్వె
పమ్మి వాదడిచేనని పంత మిచ్చెను
కొమ్మ నీయడకు నింత కోరి మొకదారికిరాయ
నెమ్మది నీవల్ల నిఁక నేరు పేమిగలదో
(॥ఇందాఁ॥)
కరఁగించేనని వచ్చి కాఁగిటనే నీకుఁ జొక్కె
వొరయఁ జూచి తానె వొక్కటాయను
తరుణి నీయడ కింత తగులమి గలదాయ
యిరవై శ్రీవేంకటేశ యెటువంటిమహిమో
(||pallavi||)
iṁdām̐kā buddisĕppidi miṁchugaṁtā vinadāya
muṁdara ninnum̐ gaṁṭāne mohiṁchĕ nidivo
(||iṁdām̐||)
salamu sādiṁcha vachchi sarasamunagum̐ jŏchchĕ
alige nanusum̐ jūsi yāsabaḍĕnu
sĕliya nīyĕḍa kiṁta sittiṇiguṇamudāya
malasi nī vĕṁta mŏgamāyagām̐ḍavo
(||iṁdām̐||)
kammaḍim̐ gŏra vachchi kannulane ninnu navvĕ
pammi vādaḍisenani paṁta michchĕnu
kŏmma nīyaḍagu niṁta kori mŏgadārigirāya
nĕmmadi nīvalla nim̐ka neru pemigalado
(||iṁdām̐||)
karam̐giṁchenani vachchi kām̐giḍane nīgum̐ jŏkkĕ
vŏrayam̐ jūsi tānĕ vŏkkaḍāyanu
taruṇi nīyaḍa kiṁta tagulami galadāya
yiravai śhrīveṁkaḍeśha yĕḍuvaṁṭimahimo