ఇందాఁక రా కుండితే నిది పావగా వలెనా
(॥పల్లవి॥)
ఇందాఁక రా కుండితే నిది పావగా వలెనా
చందాలు చెప్ప వచ్చేవు సాదించ వచ్చేమా
(॥ఇందాక॥)
ముందరికి రా రాదా మో మైనఁ జూచేను
చెంది యింతలో నేల సిగ్గు వడేవు
అందు కేమి మాచుట్టమ వవుత గల్లా యెంతయిన
కందువఁ బెనఁగ నిదె కడ మయ్యీనా
(॥ఇంచాక॥)
పీఁటపైఁ గూచుండ రాదా పిసికేము పాదాలు
యేఁటి కని వొద్దనేరా యెవ్వ రైనాను
యీటు లేనిమగవాఁడ వేమి సేసినా నేమి
కొటిసతులఁ బొందిన కోపగించేనా
(॥ఇందాక॥)
పచ్చడము గప్ప రాదా పక్కనఁ గరఁగించేను
చెచ్చెర నేల నవ్వేవు సెలవులను
అచ్చపు శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
నిచ్చఁ గూడి యున్నారమ నీవే నేఁ గానా
(||pallavi||)
iṁdām̐ka rā kuṁḍide nidi pāvagā valĕnā
saṁdālu sĕppa vachchevu sādiṁcha vachchemā
(||iṁdāga||)
muṁdarigi rā rādā mo mainam̐ jūsenu
sĕṁdi yiṁtalo nela siggu vaḍevu
aṁdu kemi māsuṭṭama vavuda gallā yĕṁtayina
kaṁduvam̐ bĕnam̐ga nidĕ kaḍa mayyīnā
(||iṁchāga||)
pīm̐ṭabaim̐ gūsuṁḍa rādā pisigemu pādālu
yem̐ṭi kani vŏddanerā yĕvva rainānu
yīḍu lenimagavām̐ḍa vemi sesinā nemi
kŏḍisadulam̐ bŏṁdina kobagiṁchenā
(||iṁdāga||)
pachchaḍamu gappa rādā pakkanam̐ garam̐giṁchenu
sĕchchĕra nela navvevu sĕlavulanu
achchabu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
nichcham̐ gūḍi yunnārama nīve nem̐ gānā