ఇంద రెరిఁగి పని కిఁక నేలయ్యా
(॥పల్లవి॥)
ఇంద రెరిఁగి పని కిఁక నేలయ్యా
పొందులు మీలో మీకుఁ బొసఁగెనయ్యా
(॥ఇంద॥)
మాటలనే మందు నూరి మగువ నీపై వలపు
నాటుకొలి పెను యేమి నవ్వేవయ్యా
చేటఁడేసి పచ్చిదేరే సిగ్గులు నీపైఁ జల్లె
వాటముగా శిరసేల వంచేవయ్యా
(॥ఇంద॥)
సన్నలనే చలివాప సరికి బేసికి నీపై
చన్నులు మోప నాపె చన వీవయ్యా
కన్నులఁదప్పక చూచె కరఁగించె నీమనసు
యెన్న రానితమకము లేల దాఁచెవయ్యా
(॥ఇంద॥)
కప్పురముమోవి నిచ్చి కాఁగిటిరతులఁ గూడె
చిప్పిలుఁజెమట గోరఁ జిమ్మేవయ్యా
యిప్పుడే శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
దప్పిదేరె నెన్నేసికతలు చెప్పివయ్యా
(||pallavi||)
iṁda rĕrim̐gi pani kim̐ka nelayyā
pŏṁdulu mīlo mīgum̐ bŏsam̐gĕnayyā
(||iṁda||)
māḍalane maṁdu nūri maguva nībai valabu
nāḍugŏli pĕnu yemi navvevayyā
seḍam̐ḍesi pachchidere siggulu nībaim̐ jallĕ
vāḍamugā śhirasela vaṁchevayyā
(||iṁda||)
sannalane salivāba sarigi besigi nībai
sannulu moba nābĕ sana vīvayyā
kannulam̐dappaga sūsĕ karam̐giṁchĕ nīmanasu
yĕnna rānidamagamu lela dām̐sĕvayyā
(||iṁda||)
kappuramumovi nichchi kām̐giḍiradulam̐ gūḍĕ
sippilum̐jĕmaḍa goram̐ jimmevayyā
yippuḍe śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
dappiderĕ nĕnnesigadalu sĕppivayyā