Imchugimchuga vimtini yeedaa naadaa naadugomgaa

ఇంచుకించుక వింటిని యీడా నాడా నాడుకోఁగా
Language

(॥పల్లవి॥)
ఇంచుకించుక వింటిని యీడా నాడా నాడుకోఁగా
కొంచించి నాతోఁ బలుకఁ గొంకేవు నీవు

(॥ఇంచు॥)
తత్తరించి లోలోనే తలపోయనేమిటికి
చిత్తములోఁ గలమాట చెప్పరాదా
గుత్తపు గుబ్బల నిన్ను కోమలి నాట నొత్తనో
కొత్తగాఁగా సిగ్గువడి కొంకేవు నీవు

(॥ఇంచు॥)
దంటవై దీమసమున దాఁచుకొననేమిటికి
నంటున వెల్లవిరిగా నవ్వరాదా
బంట పంతపురతుల భామ నిన్నోడించెనో
గొంటవై పచారించక కొంకేవు నీవు

(॥ఇంచు॥)
తాటించి పరాకుసేసి తలవంచనేమిటికి
సూటిగా నా మో మిట్టె చూడరాదా
యీటున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
కూటమి నాకెఁ గూడెనో కొంకేవు నీవు

(||pallavi||)
iṁchugiṁchuga viṁṭini yīḍā nāḍā nāḍugom̐gā
kŏṁchiṁchi nādom̐ balugam̐ gŏṁkevu nīvu

(||iṁchu||)
tattariṁchi lolone talaboyanemiḍigi
sittamulom̐ galamāḍa sĕpparādā
guttabu gubbala ninnu komali nāḍa nŏttano
kŏttagām̐gā sigguvaḍi kŏṁkevu nīvu

(||iṁchu||)
daṁṭavai dīmasamuna dām̐sugŏnanemiḍigi
naṁṭuna vĕllavirigā navvarādā
baṁṭa paṁtaburadula bhāma ninnoḍiṁchĕno
gŏṁṭavai pasāriṁchaga kŏṁkevu nīvu

(||iṁchu||)
tāḍiṁchi parāgusesi talavaṁchanemiḍigi
sūḍigā nā mo miṭṭĕ sūḍarādā
yīḍuna śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
kūḍami nāgĕm̐ gūḍĕno kŏṁkevu nīvu