ఇంచుకంతవడిలోనే యిన్నియుఁ దేరీఁగాని
(॥పల్లవి॥)
ఇంచుకంతవడిలోనే యిన్నియుఁ దేరీఁగాని
కొంచ కాతని సంగడిఁ గూచుండఁ బెట్టరే
(॥ఇంచు॥)
చెక్కుల నున్నది చింత చిత్తాన నున్నది యాస
వుక్కుమీరి మేనిమీఁద నున్నది కాఁక
యిక్కడి కిందాఁక రాక యిప్పుడు విచ్చేసెఁ బతి
మక్కువఁ జెలియమారు మాటాడరే చెలులు
(॥ఇంచు॥)
మోమున నున్న దలుక ముక్కునఁ గోప మున్నది
దీమసపుఁ జూపులలో తిట్లున్నవి
వేమారు విరహమున విభుఁడింత సేసెనంటా
కామిని దగ్గరిపోదు కదియరే మీరు
(॥ఇంచు॥)
కన్నుల నున్నది మొక్కు కాఁగిట నున్నది మేలు
సన్నల నున్నది రతిసరస మిది
యెన్నఁగ శ్రీవేంకటేశు డీయలమేల్మంగను
వున్నతిఁ గూడె నవ్వుతా నుఁడరే మీరు
(||pallavi||)
iṁchugaṁtavaḍilone yinniyum̐ derīm̐gāni
kŏṁcha kādani saṁgaḍim̐ gūsuṁḍam̐ bĕṭṭare
(||iṁchu||)
sĕkkula nunnadi siṁta sittāna nunnadi yāsa
vukkumīri menimīm̐da nunnadi kām̐ka
yikkaḍi kiṁdām̐ka rāga yippuḍu vichchesĕm̐ badi
makkuvam̐ jĕliyamāru māḍāḍare sĕlulu
(||iṁchu||)
momuna nunna daluga mukkunam̐ goba munnadi
dīmasabum̐ jūbulalo tiṭlunnavi
vemāru virahamuna vibhum̐ḍiṁta sesĕnaṁṭā
kāmini daggaribodu kadiyare mīru
(||iṁchu||)
kannula nunnadi mŏkku kām̐giḍa nunnadi melu
sannala nunnadi radisarasa midi
yĕnnam̐ga śhrīveṁkaḍeśhu ḍīyalamelmaṁganu
vunnadim̐ gūḍĕ navvudā num̐ḍare mīru