ఇంచుకంతా నెరఁగరు యేఁటిదే మీరు
(॥పల్లవి॥)
ఇంచుకంతా నెరఁగరు యేఁటిదే మీరు
మంచివారు గలితిరి మానరుగా చెలులు
(॥ఇంచు॥)
మంకుల వొట్టు వెట్టుక మాటలాడ మన్నమీఁద
యింకా నామాటలా యెరఁగరటే
అంకెల నన్నుఁ గలయు మనేరు దోసాలకుఁ
గొంకరు అప్పటి మీరు కూళలటే చెలులు
(॥ఇంచు॥)
తోడనె వాదు వెట్టుక తొలఁగి వచ్చినమీఁద
యీడా నాడాఁ దగవులా యిదిఁ గొంతా
వీడనీ కాతని నీ వెంటఁ దోడి తెచ్చితిరి
ఆడికెకు వెరవరు హంత లటే చెలులు
(॥ఇంచు॥)
యెదురెదురుకట్ల నింతకు వచ్చినమీఁద
అదిమి కాఁగిలింపించే రౌనే మీరు
అదన శ్రీవెంకటేశుఁ డంతలోనే నన్ను గూడె
సదరాన నవ్వేరు జాణలుగా చెలులు
(||pallavi||)
iṁchugaṁtā nĕram̐garu yem̐ṭide mīru
maṁchivāru galidiri mānarugā sĕlulu
(||iṁchu||)
maṁkula vŏṭṭu vĕṭṭuga māḍalāḍa mannamīm̐da
yiṁkā nāmāḍalā yĕram̐garaḍe
aṁkĕla nannum̐ galayu maneru dosālagum̐
gŏṁkaru appaḍi mīru kūḽalaḍe sĕlulu
(||iṁchu||)
toḍanĕ vādu vĕṭṭuga tŏlam̐gi vachchinamīm̐da
yīḍā nāḍām̐ dagavulā yidim̐ gŏṁtā
vīḍanī kādani nī vĕṁṭam̐ doḍi tĕchchidiri
āḍigĕgu vĕravaru haṁta laḍe sĕlulu
(||iṁchu||)
yĕdurĕdurugaṭla niṁtagu vachchinamīm̐da
adimi kām̐giliṁpiṁche raune mīru
adana śhrīvĕṁkaḍeśhum̐ ḍaṁtalone nannu gūḍĕ
sadarāna navveru jāṇalugā sĕlulu