ఇంచుకంతా నలయిక యెఱఁగ విదేమయ్య
(॥పల్లవి॥)
ఇంచుకంతా నలయిక యెఱఁగ విదేమయ్య
వంచీ శిరసు నీవు వద్దనుండఁగాను
(॥ఇంచు॥)
చెలరేఁగి చెమటలు చెంపలవెంట జారీ
బెళకుచుఁ జెలి నీతోఁ బెనఁగఁగాను
మెలుపున నొండొంటితో మీటై చన్నులు రాసీ
చలవట్టి నీతో సరసమాడఁగాను
(॥ఇంచు॥)
పైపైఁ బెదవులను పలుకుఁదేనెలు చిందీ
మాపుదాఁకాఁ జనవిచ్చి మాటాడఁగాను
రాపునఁ బెనఁగువటీ రమణీహారములెల్ల
దాపున నీచెనకులు తప్పించుకోఁగాను
(॥ఇంచు॥)
మునుకొని నొసలిపై ముంగురులు జారీని
ఘనమైనరతి నిన్నుఁ గలయఁగాను
యెనసె శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నినుపాయ నిట్టూర్పులు నిన్నుఁ గాఁగిలించఁగా
(||pallavi||)
iṁchugaṁtā nalayiga yĕṟam̐ga videmayya
vaṁchī śhirasu nīvu vaddanuṁḍam̐gānu
(||iṁchu||)
sĕlarem̐gi sĕmaḍalu sĕṁpalavĕṁṭa jārī
bĕḽagusum̐ jĕli nīdom̐ bĕnam̐gam̐gānu
mĕlubuna nŏṁḍŏṁṭido mīḍai sannulu rāsī
salavaṭṭi nīdo sarasamāḍam̐gānu
(||iṁchu||)
paibaim̐ bĕdavulanu palugum̐denĕlu siṁdī
mābudām̐kām̐ janavichchi māḍāḍam̐gānu
rābunam̐ bĕnam̐guvaḍī ramaṇīhāramulĕlla
dābuna nīsĕnagulu tappiṁchugom̐gānu
(||iṁchu||)
munugŏni nŏsalibai muṁgurulu jārīni
ghanamainaradi ninnum̐ galayam̐gānu
yĕnasĕ śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
ninubāya niṭṭūrbulu ninnum̐ gām̐giliṁcham̐gā