Imchugamtaa gutteṟamga dide meege

ఇంచుకంతా గుట్టెఱఁగ దిదే మీకే
Language

(॥పల్లవి॥)
ఇంచుకంతా గుట్టెఱఁగ దిదే మీకే
యెంచరాదు దీనిగర్వ మిదే మీకే

(॥ఇంచు॥)
సంతోసాన నీవు చేసన్నలు సేసితేను
యింతులకెల్లాఁ జూపీ నిదే మీకె
చెంత నీ నప్పటిఁ దనుఁ జేరి సుద్దు లడిగితే
యెంతసిగ్గువడీఁ దాను యిదే మీకే

(॥ఇంచు॥)
నెమ్మది నీవు దననెలవు లడిగితేను
యెమ్మెలకు నవ్వు నవ్వీ నిదే మీకె
సమ్మతించ కొనగోరు చన్నులపై నూఁదితేను
యిమ్ములఁ దప్పకచూచీ నిదే మీకె

(॥ఇంచు॥)
చుట్టరికములు నీవు సొదించి చెప్పితేనే
యిట్టే కాఁగిట నించీ నిదే మీకె
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
యెట్టిదో తనవేడుక యిదే మీకె

(||pallavi||)
iṁchugaṁtā guṭṭĕṟam̐ga dide mīge
yĕṁcharādu dīnigarva mide mīge

(||iṁchu||)
saṁtosāna nīvu sesannalu sesidenu
yiṁtulagĕllām̐ jūbī nide mīgĕ
sĕṁta nī nappaḍim̐ danum̐ jeri suddu laḍigide
yĕṁtasigguvaḍīm̐ dānu yide mīge

(||iṁchu||)
nĕmmadi nīvu dananĕlavu laḍigidenu
yĕmmĕlagu navvu navvī nide mīgĕ
sammadiṁcha kŏnagoru sannulabai nūm̐didenu
yimmulam̐ dappagasūsī nide mīgĕ

(||iṁchu||)
suṭṭarigamulu nīvu sŏdiṁchi sĕppidene
yiṭṭe kām̐giḍa niṁchī nide mīgĕ
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
yĕṭṭido tanaveḍuga yide mīgĕ