Imchugamta sibbidi ledeme neegu

ఇంచుకంత సిబ్బితి లేదేమే నీకు
Language

(॥పల్లవి॥)
ఇంచుకంత సిబ్బితి లేదేమే నీకు
కొంచక యెలయింతురా కొలువులో విభుని

(॥ఇంచు॥)
కలసేయప్పటివేళ కాఁగిలించుకొంటగాక
మలసి తమకింతురా మగవానితో
పిలిచినప్పటివేళ ప్రియాలు సేతురుగాక
బలుములు చూపుదురా పంతగానితోను

(॥ఇంచు॥)
చేయి చాఁచినప్పుడే సేవలు సేతురుగాక
రాయడులు సేతురా రమణునితో
ఆయములంటినవేళే అంకెకు వత్తురుగాక
కాయ మలఇంతురా ఘనుఁడైన వానిని

(॥ఇంచు॥)
రతిసమయముననే రచన చూపుటగాక
కతలు చెప్పుదురా కాంతునితో
ఇతవై శ్రీవేంకటేశుఁ డితఁడే నిన్నుఁ గూడె
తతిఁ గొసరుదురా తనఇచ్చ వానిని

(||pallavi||)
iṁchugaṁta sibbidi ledeme nīgu
kŏṁchaga yĕlayiṁturā kŏluvulo vibhuni

(||iṁchu||)
kalaseyappaḍiveḽa kām̐giliṁchugŏṁṭagāga
malasi tamagiṁturā magavānido
pilisinappaḍiveḽa priyālu sedurugāga
balumulu sūbudurā paṁtagānidonu

(||iṁchu||)
seyi sām̐sinappuḍe sevalu sedurugāga
rāyaḍulu sedurā ramaṇunido
āyamulaṁṭinaveḽe aṁkĕgu vatturugāga
kāya mala̮iṁturā ghanum̐ḍaina vānini

(||iṁchu||)
radisamayamunane rasana sūbuḍagāga
kadalu sĕppudurā kāṁtunido
idavai śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe ninnum̐ gūḍĕ
tadim̐ gŏsarudurā tana̮ichcha vānini