ఇంచుకంత సన్నెఱఁగఁ డిదేమే తాను
(॥పల్లవి॥)
ఇంచుకంత సన్నెఱఁగఁ డిదేమే తాను
మంచముపై నుండితేనే మర్మము సోఁకె ననీ
(॥ఇంచు॥)
చెవిలోమాట చెప్పితే సెలవుల నవ్వీని
తివిరి గోర నూఁదితే తిట్టు దిట్టీని
చివురున వేసితేను చిత్తగించి మిట్టిపడీ
జవళిఁ గూచుండితేను చన్నులొత్తె ననీని
(॥ఇంచు॥)
మొగము చేతనెత్తితేను మోవి గంటిరేఁగె ననీ
తగిలి చూచితేను చేతను దొబ్బీని
పగటున మొక్కితేను పాదము లొత్తె ననీని
వొగిఁ గాలు దొక్కితేనే వొరట్లనీని
(॥ఇంచు॥)
పచ్చడము గప్పితేను పట్టి తీసితి ననీని
యిచ్చక మాడితే వెంగె మేఁటి కనీని
పచ్చిగా శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడి
మెచ్చినా నప్పటి మితిమీరితి ననీని
(||pallavi||)
iṁchugaṁta sannĕṟam̐gam̐ ḍideme tānu
maṁchamubai nuṁḍidene marmamu som̐kĕ nanī
(||iṁchu||)
sĕvilomāḍa sĕppide sĕlavula navvīni
tiviri gora nūm̐dide tiṭṭu diṭṭīni
sivuruna vesidenu sittagiṁchi miṭṭibaḍī
javaḽim̐ gūsuṁḍidenu sannulŏttĕ nanīni
(||iṁchu||)
mŏgamu sedanĕttidenu movi gaṁṭirem̐gĕ nanī
tagili sūsidenu sedanu dŏbbīni
pagaḍuna mŏkkidenu pādamu lŏttĕ nanīni
vŏgim̐ gālu dŏkkidene vŏraṭlanīni
(||iṁchu||)
pachchaḍamu gappidenu paṭṭi tīsidi nanīni
yichchaga māḍide vĕṁgĕ mem̐ṭi kanīni
pachchigā śhrīveṁkaḍādribadi nannu niḍu gūḍi
mĕchchinā nappaḍi midimīridi nanīni