(॥పల్లవి॥)
ఇంచుకంత చాలదా యీడవారికి
పెంచిపెంచి నీవె రచ్చఁబెట్టుకోవయ్యా
(॥॥)
చిటుకంటేఁ జొలదా సిగ్గుగలదానికి
తటుకన నీవద్దఁ దలవంచను
కటకట నవ్వఁబోయి కన్నవారిచేతనెల్ల
దిటముగా నీవలెఁ దిట్టించుకోవలెనా
(॥॥)
గొణఁగితేఁ జాలదా గుటుతోడిదానికి
వొణఁ కెతోఁ గన్నుల నీ రొలికించను
అణఁగక కన్నవారి ఆయాలకుఁ జేచాఁచి
సణఁగుల నీవలె జంకెఁబడవలెనా
(॥॥)
డగరితేఁ జాలదా తమకించేదానికి
వొగ్గినరతులలో నోలలాడను
నిగ్గుల శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
బగ్గన నీవలె వేరేపంత మియ్యవలెనా
(||pallavi||)
iṁchugaṁta sāladā yīḍavārigi
pĕṁchibĕṁchi nīvĕ rachcham̐bĕṭṭugovayyā
(||||)
siḍugaṁṭem̐ jŏladā siggugaladānigi
taḍugana nīvaddam̐ dalavaṁchanu
kaḍagaḍa navvam̐boyi kannavārisedanĕlla
diḍamugā nīvalĕm̐ diṭṭiṁchugovalĕnā
(||||)
gŏṇam̐gidem̐ jāladā guḍudoḍidānigi
vŏṇam̐ kĕdom̐ gannula nī rŏligiṁchanu
aṇam̐gaga kannavāri āyālagum̐ jesām̐si
saṇam̐gula nīvalĕ jaṁkĕm̐baḍavalĕnā
(||||)
ḍagaridem̐ jāladā tamagiṁchedānigi
vŏgginaradulalo nolalāḍanu
niggula śhrī veṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
baggana nīvalĕ verebaṁta miyyavalĕnā