ఇంచుకంత పతిఁ బాసి యెంత సేసేవే
(॥పల్లవి॥)
ఇంచుకంత పతిఁ బాసి యెంత సేసేవే
మంచముపై నుండఁగా మంకుఁదనమునను
(॥ఇంచు॥)
యించువిలుతుబాణము లింతి నీ కన్నులలోన
నించుకొనె సారె నేల నిటఁ దొక్కేవే
పంచనున్న జక్కవలు పయ్యదలో నుండఁగానే
కంచపుటూర్పుల నేలగాలిఁ బుచ్చేవే
(॥ఇంచు॥)
తోరపు నీ కొప్పులోని తుమ్మిదబలగముల
సారె జాఱఁదోసి యేల సడిఁబెట్టేవే
నారుకొన్న చింతతోడ నడపుల హంసలను
నేరుపునఁ గాళ్ళ నేల నేలఁ బామేవే
(॥ఇంచు॥)
గుత్తపుఁ దీగెవంటి కోమలపు నీ మేన
ముత్తెపుఁ బులక లేల మోపుగట్టేవే
హత్తిన శ్రీవేంకటేశుఁ డంతలోనే నిన్నుఁ గూడె
కుత్తికమాట కోవిలగు ట్టేల సేసేవే
(||pallavi||)
iṁchugaṁta padim̐ bāsi yĕṁta seseve
maṁchamubai nuṁḍam̐gā maṁkum̐danamunanu
(||iṁchu||)
yiṁchuviludubāṇamu liṁti nī kannulalona
niṁchugŏnĕ sārĕ nela niḍam̐ dŏkkeve
paṁchanunna jakkavalu payyadalo nuṁḍam̐gāne
kaṁchabuḍūrbula nelagālim̐ buchcheve
(||iṁchu||)
torabu nī kŏppuloni tummidabalagamula
sārĕ jāṟam̐dosi yela saḍim̐bĕṭṭeve
nārugŏnna siṁtadoḍa naḍabula haṁsalanu
nerubunam̐ gāḽḽa nela nelam̐ bāmeve
(||iṁchu||)
guttabum̐ dīgĕvaṁṭi komalabu nī mena
muttĕbum̐ bulaga lela mobugaṭṭeve
hattina śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone ninnum̐ gūḍĕ
kuttigamāḍa kovilagu ṭṭela seseve