Imchugamta ne nemannaa nimtasesevu

ఇంచుకంత నే నేమన్నా నింతసేసేవు
Language

(॥పల్లవి॥)
ఇంచుకంత నే నేమన్నా నింతసేసేవు
వుంచపు కోవెల కూఁత కోరి చెట్టుంటివిరా

(॥ఇంచు॥)
చెక్కు నొక్క రాఁగాను జీరవారెనో యేమో
యెక్కువ నొచ్చె ననేవు యేమాయరా
కక్కసించి మరుఁ డేసేగంటిలేనిపోట్లకు
తక్కక ఇందాఁక నెట్టు ధరియించితివిరా

(॥ఇంచు॥)
తమ్మరస ముమియఁగ తప్పి నీపైఁబడె నేమో
యెమ్మెలకో కోపగించె వేమాయరా
యిమ్ముల నాచెలులాడే యెంగిలిమాటలకెల్ల
అమ్మరో నీవెట్లను అలుగ వైతివిరా

(॥ఇంచు॥)
కొప్పు నీకుఁ బెట్టఁగాను కుచములు సోఁకె నేమో
ఇప్పుడే మైమరచే వేమాయరా
అప్పణ శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
దప్పికి నీమో వానితి తాలిమి నెట్టుంటివో

(||pallavi||)
iṁchugaṁta ne nemannā niṁtasesevu
vuṁchabu kovĕla kūm̐ta kori sĕṭṭuṁṭivirā

(||iṁchu||)
sĕkku nŏkka rām̐gānu jīravārĕno yemo
yĕkkuva nŏchchĕ nanevu yemāyarā
kakkasiṁchi marum̐ ḍesegaṁṭileniboṭlagu
takkaga iṁdām̐ka nĕṭṭu dhariyiṁchidivirā

(||iṁchu||)
tammarasa mumiyam̐ga tappi nībaim̐baḍĕ nemo
yĕmmĕlago kobagiṁchĕ vemāyarā
yimmula nāsĕlulāḍe yĕṁgilimāḍalagĕlla
ammaro nīvĕṭlanu aluga vaidivirā

(||iṁchu||)
kŏppu nīgum̐ bĕṭṭam̐gānu kusamulu som̐kĕ nemo
ippuḍe maimarase vemāyarā
appaṇa śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
dappigi nīmo vānidi tālimi nĕṭṭuṁṭivo