ఇంచుకంత జాణతన మెరఁగవేమో కాక
(॥పల్లవి॥)
ఇంచుకంత జాణతన మెరఁగవేమో కాక
మంచముపై నెక్కితేను మారుమోము సేతురా
(॥ఇంచు॥)
కప్పుర మిమ్మని యంటే కన్నులపైఁ జల్లితిని
చెప్పినంతకంటె మరీఁ జేయనా నేను
రెప్పలెత్తి చూచేవు రేసులు నీకేల పుట్టె
తిప్పి నిమ్మపంట వేసితే రాత వేతురా
(॥ఇంచు॥)
యిక్కడికి రమ్మనంటే యిల్లల్లా నేఁ జేకొంటి
యెక్కుడు నీమాటకంటె నింత సేయనా
వెక్కసాలే లాడేవు వేగిర మేఁటికి వచ్చె
మొక్కేటి వారితోనే మోనలు చూపుదురా
(॥ఇంచు॥)
కోరి కూడుమని యంటే గురుతులు నించితిని
సారె నీకంటె నెక్కుడు చన వియ్యనా
యీరీతి శ్రీవేంకటేశ యిన్నిమారులు గూడితి
పోరచి వెట్టినవారిఁ జూఁచి కొసరుదురా
(||pallavi||)
iṁchugaṁta jāṇadana mĕram̐gavemo kāga
maṁchamubai nĕkkidenu mārumomu sedurā
(||iṁchu||)
kappura mimmani yaṁṭe kannulabaim̐ jallidini
sĕppinaṁtagaṁṭĕ marīm̐ jeyanā nenu
rĕppalĕtti sūsevu resulu nīgela puṭṭĕ
tippi nimmabaṁṭa veside rāda vedurā
(||iṁchu||)
yikkaḍigi rammanaṁṭe yillallā nem̐ jegŏṁṭi
yĕkkuḍu nīmāḍagaṁṭĕ niṁta seyanā
vĕkkasāle lāḍevu vegira mem̐ṭigi vachchĕ
mŏkkeḍi vāridone monalu sūbudurā
(||iṁchu||)
kori kūḍumani yaṁṭe gurudulu niṁchidini
sārĕ nīgaṁṭĕ nĕkkuḍu sana viyyanā
yīrīdi śhrīveṁkaḍeśha yinnimārulu gūḍidi
porasi vĕṭṭinavārim̐ jūm̐si kŏsarudurā