Imchugamta gu tteramga veraa neevu

ఇంచుకంత గు ట్టెరఁగ వేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఇంచుకంత గు ట్టెరఁగ వేరా నీవు
చంచుల నీ విట్టైతే సరకు సేయురా

(॥ఇంచు॥)
కప్పుర మియ్యక తొల్లేకడు వేగిరము నీకు
అప్పుడె కాఁగిట నన్ను నప్పళించేవు
వుప్పటించి యిది చూచి వున్నబోఁటి ఆఁటదైతే
చిప్పిలఁగ సేయఁగలసేఁత లెల్లఁ జేయదా

(॥ఇంచు॥)
ఆకు మడి చియ్యఁగానే ఆయము లంటి నన్ను
చేకొని మైమఱపంచి చిమ్మి రేఁచేవు
కాకరిసతులు నీకతలెల్లాఁ జూచితేను
మేకులకు నీతో మందెమేళమున నుండరా

(॥ఇంచు॥)
పనివడి నే నిట్టే పానువు వరచఁగానే
గొనకొని నన్నుఁ గూడి కొంగు వట్టేవు
యెనయుచు శ్రీ వేంకటేశ యితరులై తేను
చనవు మెరసి నిన్ను చలము సాదించరా

(||pallavi||)
iṁchugaṁta gu ṭṭĕram̐ga verā nīvu
saṁchula nī viṭṭaide saragu seyurā

(||iṁchu||)
kappura miyyaga tŏllegaḍu vegiramu nīgu
appuḍĕ kām̐giḍa nannu nappaḽiṁchevu
vuppaḍiṁchi yidi sūsi vunnabom̐ṭi ām̐ṭadaide
sippilam̐ga seyam̐galasem̐ta lĕllam̐ jeyadā

(||iṁchu||)
āgu maḍi siyyam̐gāne āyamu laṁṭi nannu
segŏni maimaṟabaṁchi simmi rem̐sevu
kāgarisadulu nīgadalĕllām̐ jūsidenu
megulagu nīdo maṁdĕmeḽamuna nuṁḍarā

(||iṁchu||)
panivaḍi ne niṭṭe pānuvu varasam̐gāne
gŏnagŏni nannum̐ gūḍi kŏṁgu vaṭṭevu
yĕnayusu śhrī veṁkaḍeśha yidarulai tenu
sanavu mĕrasi ninnu salamu sādiṁcharā