Imchugamta dharmamulo nunnadi yimdari melunum geedunu

ఇంచుకంత ధర్మములో నున్నది యిందరి మేలునుఁ గీడును
Language

(॥పల్లవి॥)
ఇంచుకంత ధర్మములో నున్నది యిందరి మేలునుఁ గీడును
వంచన తోడుతఁ గైకొనఁ దలఁచినవారల నేరుపు లింతేకాని

(॥ఇంచు॥)
నరకము లనుభవించితి నని తలఁచిన నలిఁజెడుఁబ్రారబ్థ కర్మములు
పరదారాదులఁ గలయఁ దలఁచిన పాపములెల్లనుఁ జుట్టుకొను
సురల చరిత్రము వినినయంతలో సుకృతియై వెలయుఁ బురుషుడు
దురితచిత్తుల విధంబులు వింటే దుష్కృత్యములకును గుఱియిగును

(॥ఇంచు॥)
చచ్చినభావమె బ్రతికిన యప్పుడు శరీరసుఖములు మఱచిన ముక్తుఁడు
యిచ్చల మృతునకు విభవము సేసిన యేడకు నెక్కుదువృధా వృధా
మెచ్చుగ నొరులకు నిచ్చిన యర్థము మీఁదమీఁద ఫలియించు
తెచ్చి లోభమున దాఁచిన ధనములు తీరక భూగతమైయుండు

(॥ఇంచు॥)
యిలువేలుపైన శ్రీవేంకటేశ్వరు నెఱిఁగికొలిచినను భవమీడేరును
పలుకర్మంబుల నెంత దొరలినా ప్రయాసములే కడు ఘనము
అలమేల్మంగ పురుషాకారమున ఆచార్యుననుమతి మెలఁగును
వలవని లావుల వశగతుఁడై నను వానిచందములు హరియే

(||pallavi||)
iṁchugaṁta dharmamulo nunnadi yiṁdari melunum̐ gīḍunu
vaṁchana toḍudam̐ gaigŏnam̐ dalam̐sinavārala nerubu liṁtegāni

(||iṁchu||)
naragamu lanubhaviṁchidi nani talam̐sina nalim̐jĕḍum̐brārabtha karmamulu
paradārādulam̐ galayam̐ dalam̐sina pābamulĕllanum̐ juṭṭugŏnu
surala saritramu vininayaṁtalo sukṛtiyai vĕlayum̐ buruṣhuḍu
duridasittula vidhaṁbulu viṁṭe duṣhkṛtyamulagunu guṟiyigunu

(||iṁchu||)
sachchinabhāvamĕ bradigina yappuḍu śharīrasukhamulu maṟasina muktum̐ḍu
yichchala mṛtunagu vibhavamu sesina yeḍagu nĕkkuduvṛdhā vṛdhā
mĕchchuga nŏrulagu nichchina yardhamu mīm̐damīm̐da phaliyiṁchu
tĕchchi lobhamuna dām̐sina dhanamulu tīraga bhūgadamaiyuṁḍu

(||iṁchu||)
yiluvelubaina śhrīveṁkaḍeśhvaru nĕṟim̐gigŏlisinanu bhavamīḍerunu
palugarmaṁbula nĕṁta dŏralinā prayāsamule kaḍu ghanamu
alamelmaṁga puruṣhāgāramuna āsāryunanumadi mĕlam̐gunu
valavani lāvula vaśhagadum̐ḍai nanu vānisaṁdamulu hariye