Imchugaina naya miyyavu

ఇంచుకైన నయ మియ్యవు
Language

(॥పల్లవి॥)
ఇంచుకైన నయ మియ్యవు
యెంచఁగఁ బతి నిను నేమనునే

(॥ఇంచు॥)
పంతముమీఁదట్టిలుకులే కడకును
వంతులతోడివే వాసులు
కాంతరో నీ విటు నెరపఁగా
యింతట్టితి యిఁక నేమనునే

(॥ఇంచు॥)
చెక్కులమీఁదివె చేతులు గడకును
ముక్కుమీఁదిదే మొనవేలు
గుక్కక నీ విటు గుట్టున నుండఁగ
యిక్కడ నితఁ డిక నేమనునే

(॥ఇంచు॥)
శిరసువంపులే సిగ్గులు గడకును
సరుఁస గూటములు సమరతులు
పరగ శ్రీవేంకటపతి నిటు గూడితిఁ
విరవాయ నితఁడు యేమనునే

(||pallavi||)
iṁchugaina naya miyyavu
yĕṁcham̐gam̐ badi ninu nemanune

(||iṁchu||)
paṁtamumīm̐daṭṭilugule kaḍagunu
vaṁtuladoḍive vāsulu
kāṁtaro nī viḍu nĕrabam̐gā
yiṁtaṭṭidi yim̐ka nemanune

(||iṁchu||)
sĕkkulamīm̐divĕ sedulu gaḍagunu
mukkumīm̐dide mŏnavelu
gukkaga nī viḍu guṭṭuna nuṁḍam̐ga
yikkaḍa nidam̐ ḍiga nemanune

(||iṁchu||)
śhirasuvaṁpule siggulu gaḍagunu
sarum̐sa gūḍamulu samaradulu
paraga śhrīveṁkaḍabadi niḍu gūḍidim̐
viravāya nidam̐ḍu yemanune