Illu mamchamu nunnadi iddaramu numde meeda

ఇల్లు మంచము నున్నది ఇద్దరము నుండే మీడ
Language

(॥పల్లవి॥)
ఇల్లు మంచము నున్నది ఇద్దరము నుండే మీడ
తెల్లమిగ నా కొసరు దిద్దుక రారాదా

(॥ఇల్లు॥)
ఆపెమోము చెమరించె నట్టె నీమై చెంగలించె
యేపున మీమోహాలు మాకేల దాఁచేరు
వోపిక నే మిందరము వుండితే నీకేమాయ
లోపలికిఁబోఇ అట్టె లోఁగొని రారాదా

(॥ఇల్లు॥)
తప్పక చూచీ నాపె తలఁపు నీ కందున్నది
ఇప్పుడు మీమోహాలు మాకేల దాఁచేరు
చెప్పక నే మెఱిఁగితే సిగ్గులు మీకేల వచ్చె
దుప్పటి మఱుఁగువట్టే తొక్కరాదా పాదము

(॥ఇల్లు॥)
సెలవి నాపె నవ్వె చే సన్నలు సేసితివి
యలమి మీ మోహాలు మాకేల దాఁచేవు
తొలుతే శ్రీ వేంకటేశ దొమ్మిగాఁ గూడితి మిట్టె
మలఁగుపై నున్న దాపె మాటలాడరాదా

(||pallavi||)
illu maṁchamu nunnadi iddaramu nuṁḍe mīḍa
tĕllamiga nā kŏsaru didduga rārādā

(||illu||)
ābĕmomu sĕmariṁchĕ naṭṭĕ nīmai sĕṁgaliṁchĕ
yebuna mīmohālu māgela dām̐seru
vobiga ne miṁdaramu vuṁḍide nīgemāya
lobaligim̐boi aṭṭĕ lom̐gŏni rārādā

(||illu||)
tappaga sūsī nābĕ talam̐pu nī kaṁdunnadi
ippuḍu mīmohālu māgela dām̐seru
sĕppaga ne mĕṟim̐gide siggulu mīgela vachchĕ
duppaḍi maṟum̐guvaṭṭe tŏkkarādā pādamu

(||illu||)
sĕlavi nābĕ navvĕ se sannalu sesidivi
yalami mī mohālu māgela dām̐sevu
tŏlude śhrī veṁkaḍeśha dŏmmigām̐ gūḍidi miṭṭĕ
malam̐gubai nunna dābĕ māḍalāḍarādā