Illaamdlevooru yee rasamu levooru

ఇల్లాండ్లేవూరు యీ రసము లేవూరు
Language

(॥పల్లవి॥)
ఇల్లాండ్లేవూరు యీ రసము లేవూరు
చల్లనై నీ యంత నీవే సంతమౌట గాక

(॥ఇల్లాం॥)
కందువలు దెలిపేనా కాంతలకు నీకును
నిందలాడే వారి మాఁట నే ననేఁగాక
అంది నిన్ను యిందుకుఁగా అపరాదాల నెంచేనా
సంది నీగుణాలు నీవే చక్కనౌట గాక

(॥ఇల్లాం॥)
మచ్చరములు చూపేనా మగవలకును నీకు
పచ్చి చేఁత లెంచేవారిపాటి నేఁగాక
వొచ్చెమని నిన్నిందుకు వొరయఁజూచేనా
యిచ్చల నీ తగవు నీ వెరుఁగుట గాక

(॥ఇల్లాం॥)
చలములు సాదించేనా సతులకు నీకును
కొలవు వారి పొత్తులు కొసరేఁగాక
యెలమి శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
బెళకగ నీవే నాకు ప్రియమౌట గాక

(||pallavi||)
illāṁḍlevūru yī rasamu levūru
sallanai nī yaṁta nīve saṁtamauḍa gāga

(||illāṁ||)
kaṁduvalu dĕlibenā kāṁtalagu nīgunu
niṁdalāḍe vāri mām̐ṭa ne nanem̐gāga
aṁdi ninnu yiṁdugum̐gā abarādāla nĕṁchenā
saṁdi nīguṇālu nīve sakkanauḍa gāga

(||illāṁ||)
machcharamulu sūbenā magavalagunu nīgu
pachchi sem̐ta lĕṁchevāribāḍi nem̐gāga
vŏchchĕmani ninniṁdugu vŏrayam̐jūsenā
yichchala nī tagavu nī vĕrum̐guḍa gāga

(||illāṁ||)
salamulu sādiṁchenā sadulagu nīgunu
kŏlavu vāri pŏttulu kŏsarem̐gāga
yĕlami śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
bĕḽagaga nīve nāgu priyamauḍa gāga