ఇల్లాండ్ల కిది వోజ యింపులు నీకే కాక
(॥పల్లవి॥)
ఇల్లాండ్ల కిది వోజ యింపులు నీకే కాక
చిల్లర లింకాఁ గలవు చిత్తగించవయ్యా
(॥ఇల్లాం॥)
చిగురుమోవి వంచి సెలవినే నవ్వునవ్వి
సగము మాటలాడీ సతి నీతోను
యెగసక్కేలై తోఁచు యేమిచెప్పినా నేము
జిగి నీవే ఆపెమోము చిత్తగించవయ్యా
(॥ఇల్లాం॥)
కడకంటనుఁ జూచి కందువ సన్నలుసేసి
జడిసిఁ వలపుచల్లీ సతి నీతోను
తడవితే సవతులందలిమచ్చర మనేరు
చిడుముడి యింకా నీవే చిత్తగించవయ్యా
(॥ఇల్లాం॥)
చేయిఁ జేయి నప్పళించి చెలఁగి పందేలు వేసి
చాయలకు గోరనొ త్తీ సతి నీతోను
యీయెడ శ్రీ వేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
చేయరానిచేఁత సేసె చిత్తగించవయ్యా
(||pallavi||)
illāṁḍla kidi voja yiṁpulu nīge kāga
sillara liṁkām̐ galavu sittagiṁchavayyā
(||illāṁ||)
sigurumovi vaṁchi sĕlavine navvunavvi
sagamu māḍalāḍī sadi nīdonu
yĕgasakkelai tom̐su yemisĕppinā nemu
jigi nīve ābĕmomu sittagiṁchavayyā
(||illāṁ||)
kaḍagaṁṭanum̐ jūsi kaṁduva sannalusesi
jaḍisim̐ valabusallī sadi nīdonu
taḍavide savadulaṁdalimachchara maneru
siḍumuḍi yiṁkā nīve sittagiṁchavayyā
(||illāṁ||)
seyim̐ jeyi nappaḽiṁchi sĕlam̐gi paṁdelu vesi
sāyalagu goranŏ ttī sadi nīdonu
yīyĕḍa śhrī veṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
seyarānisem̐ta sesĕ sittagiṁchavayyā