Illaali kidi vojaa yichchagame valem gaaga

ఇల్లాలి కిది వోజా యిచ్చకమే వలెఁ గాక
Language

(॥పల్లవి॥)
ఇల్లాలి కిది వోజా యిచ్చకమే వలెఁ గాక
వొల్లనె ఆతఁడు దానే వొద్దికయ్యీఁ గాక

(॥ఇల్లాలి॥)
వొత్తుకోలుమోహములు వొగి నెందాఁకా వచ్చీ
హత్తి మనసునఁ గలయంతే కాక
తత్తరించి వాని నిఁకఁ దడవకురే మీరు
కొత్తగా దయ వుట్టితేఁ గోరి వచ్చీఁ గాక

(॥ఇల్లాలి॥)
పూసుక వాసుక వచ్చెపొదు లెందాఁకా వచ్చీ
ఆసతోడ నంత నైతే నమరుఁ గాక
వేసరించ నిఁక నేలె వేఁగుదాఁకా నాతని
బాసతో నమ్మి వుండఁగఁ బాలించీఁ గాక

(॥ఇల్లాలి॥)
బలిమిఁ బట్టెకాఁగిలి బడిబడి నేల వచ్చీ
అలరుఁ గరిమి సరి యైతేఁ గాక
యెలమి శ్రీవెంకటేశుఁడిప్పు డిట్టె నన్నుఁ గూడె
యిలఁ దనసొ మ్మైతి నిట్టె యేలీఁ గాక

(||pallavi||)
illāli kidi vojā yichchagame valĕm̐ gāga
vŏllanĕ ādam̐ḍu dāne vŏddigayyīm̐ gāga

(||illāli||)
vŏttugolumohamulu vŏgi nĕṁdām̐kā vachchī
hatti manasunam̐ galayaṁte kāga
tattariṁchi vāni nim̐kam̐ daḍavagure mīru
kŏttagā daya vuṭṭidem̐ gori vachchīm̐ gāga

(||illāli||)
pūsuga vāsuga vachchĕbŏdu lĕṁdām̐kā vachchī
āsadoḍa naṁta naide namarum̐ gāga
vesariṁcha nim̐ka nelĕ vem̐gudām̐kā nādani
bāsado nammi vuṁḍam̐gam̐ bāliṁchīm̐ gāga

(||illāli||)
balimim̐ baṭṭĕgām̐gili baḍibaḍi nela vachchī
alarum̐ garimi sari yaidem̐ gāga
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
yilam̐ danasŏ mmaidi niṭṭĕ yelīm̐ gāga