Illaali kemtige yiduvamti panulu

ఇల్లాలి కేఁటికే యిటువంటి పనులు
Language

(॥పల్లవి॥)
ఇల్లాలి కేఁటికే యిటువంటి పనులు
పల్లదాన నాతఁడే బతుక నీరే

(॥ఇల్లా॥)
పంత మాడెదానఁగాను పతితోడ సారె సారె
యెంతైనా నిచ్చకురాల నింతే కానీ
వంతులకుఁ జెలు లేల వాసులు రేఁచేరే నాకు
కాంతుఁ డేపుణ్యమైనఁ గట్టుకోనీరే

(॥ఇల్లా॥)
వేసరించేదానఁగాను వెతసేసి యాతనికి
ఆసల నాతఁడే నేనై వుందుఁ గాని
సేస వెట్టించినమీరే చెప్పకురే కొండేలు
బాస దప్పి యాతఁడే ఆఫల మందనీరే

(॥ఇల్లా॥)
చెనకేటిదానఁగాను శ్రీవేంకటేశ్వరుని
తనుఁ దానె కూడితేనే దక్కుదుఁ గాని
మనసిచ్చె నాకు నేఁడు మన్నించె నాతఁ డెందు
వెనకటిచేఁత తానే విచారించుకోనీరే

(||pallavi||)
illāli kem̐ṭige yiḍuvaṁṭi panulu
palladāna nādam̐ḍe baduga nīre

(||illā||)
paṁta māḍĕdānam̐gānu padidoḍa sārĕ sārĕ
yĕṁtainā nichchagurāla niṁte kānī
vaṁtulagum̐ jĕlu lela vāsulu rem̐sere nāgu
kāṁtum̐ ḍebuṇyamainam̐ gaṭṭugonīre

(||illā||)
vesariṁchedānam̐gānu vĕdasesi yādanigi
āsala nādam̐ḍe nenai vuṁdum̐ gāni
sesa vĕṭṭiṁchinamīre sĕppagure kŏṁḍelu
bāsa dappi yādam̐ḍe āphala maṁdanīre

(||illā||)
sĕnageḍidānam̐gānu śhrīveṁkaḍeśhvaruni
tanum̐ dānĕ kūḍidene dakkudum̐ gāni
manasichchĕ nāgu nem̐ḍu manniṁchĕ nādam̐ ḍĕṁdu
vĕnagaḍisem̐ta tāne visāriṁchugonīre