ఇల్లాలయినదాని కిది గురుతు
(॥పల్లవి॥)
ఇల్లాలయినదాని కిది గురుతు
చెల్లుబడి నాది నీ చిత్తము నా భాగ్యము
(॥॥)
పంతువెట్టుకొని నీకు వలచిదానను
పంతమాడవచ్చునా బలిమితోను
చింతదీర నెప్పుడు నీసేవలెల్లా జేయఁ గాను
చెంత నుంటి ఇఁకను నీచి త్తము నాభాగ్యము
(॥॥)
యెనయ జవ్వనము మీ దెత్తుకున్నదానను
పెనఁగఁగవచ్చునా బింకాన నీతో
మనసిచ్చి యెప్పుడు నీమాటలోనిదాననై
చెనకఁగా నిఁక నీచిత్తము నాభాగ్యము
(॥॥)
దిట్టతనమున నీకు దేవులనైనదానను
రట్టు సేయవచ్చునా యిట్టి నీతోను
ఇట్టె శ్రీవేంకటేశ యెనసితిని: నీవు రాఁగా
చిట్టకము లేలిఁక నీచిత్తము నాభాగ్యము
(||pallavi||)
illālayinadāni kidi gurudu
sĕllubaḍi nādi nī sittamu nā bhāgyamu
(||||)
paṁtuvĕṭṭugŏni nīgu valasidānanu
paṁtamāḍavachchunā balimidonu
siṁtadīra nĕppuḍu nīsevalĕllā jeyam̐ gānu
sĕṁta nuṁṭi im̐kanu nīsi ttamu nābhāgyamu
(||||)
yĕnaya javvanamu mī dĕttugunnadānanu
pĕnam̐gam̐gavachchunā biṁkāna nīdo
manasichchi yĕppuḍu nīmāḍalonidānanai
sĕnagam̐gā nim̐ka nīsittamu nābhāgyamu
(||||)
diṭṭadanamuna nīgu devulanainadānanu
raṭṭu seyavachchunā yiṭṭi nīdonu
iṭṭĕ śhrīveṁkaḍeśha yĕnasidini: nīvu rām̐gā
siṭṭagamu lelim̐ka nīsittamu nābhāgyamu