ఇల్లాలఁ గనక నిన్నేమీ నననోపను
(॥పల్లవి॥)
ఇల్లాలఁ గనక నిన్నేమీ నననోపను
వుల్లములో బెట్టుకొని వుండితేనే చాలును
(॥ఇల్లా॥)
అంతరంగములుగాను ఆపె నీవు నాడుకొన్న-
వింత వింత మాటలెల్లా వింటిమి నేము
చెతల నీతో నవి చెప్పఁబోతే సిగ్గయ్యీని
మంతనానఁ దలఁచుకో మరి నీకు నీవే
(॥ఇల్లా॥)
చెంది మీరిద్దరు లోలోఁ జేసుకొన్న చేఁతలెల్ల
కందువ గన్నులెదుటఁ గంటిమి నేము
అందరిలోఁ జూపఁబోతే అవి గడుఁ బచ్చిదేరీ
పొందులుగాఁ గనుకో ఇప్పుడు నీకు నీవే
(॥ఇల్లా॥)
ఱట్టుగా మీకాఁగిటియాఱడి నింతయు
నెఱిఁగి గుట్టున బైకొని నవ్వుకొంటిమి నేము
నెట్టన శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
అట్టె నన్నేలితివి పాయకు నీకు నీవే
(||pallavi||)
illālam̐ ganaga ninnemī nananobanu
vullamulo bĕṭṭugŏni vuṁḍidene sālunu
(||illā||)
aṁtaraṁgamulugānu ābĕ nīvu nāḍugŏnna-
viṁta viṁta māḍalĕllā viṁṭimi nemu
sĕdala nīdo navi sĕppam̐bode siggayyīni
maṁtanānam̐ dalam̐sugo mari nīgu nīve
(||illā||)
sĕṁdi mīriddaru lolom̐ jesugŏnna sem̐talĕlla
kaṁduva gannulĕduḍam̐ gaṁṭimi nemu
aṁdarilom̐ jūbam̐bode avi gaḍum̐ bachchiderī
pŏṁdulugām̐ ganugo ippuḍu nīgu nīve
(||illā||)
ṟaṭṭugā mīgām̐giḍiyāṟaḍi niṁtayu
nĕṟim̐gi guṭṭuna baigŏni navvugŏṁṭimi nemu
nĕṭṭana śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
aṭṭĕ nannelidivi pāyagu nīgu nīve