Illaalam ganaga nee yichchalone melamgenu

ఇల్లాలఁ గనక నీ యిచ్చలోనే మెలఁగేను
Language

(॥పల్లవి॥)
ఇల్లాలఁ గనక నీ యిచ్చలోనే మెలఁగేను
వెల్లి విరియై వుండగా వెస నేమిసేతును

(॥ఇల్లాల॥)
వద్ద నుండి వూఁకొనేటివారు గలితే నీవు
సుద్దు లెన్నైనాఁ జెప్పేవు సూటిపడను
అద్దుకొని యెవత్తె పై యాసాసలనో నీకు
నిద్దుర రాకుండితేను నే నేమి సేతును

(॥ఇల్లాల॥)
పవ్వళించి నీవద్ద పాయకుండేవారు గలితే
నవ్వు లెన్నైనా నవ్వేవు నడుమ నీవు
జవ్వనులఁ గూడి యాడి సంతోసాలు దలపోసి
యివ్వల సుమాళ మైతే యింక నే నేమి సేతును

(॥ఇల్లాల॥)
లోకములో సారె నీకు లోనయ్యేవారు గలితే
పైకొని రతి సేసేవు పంతాన నీవు
యీకడ శ్రీవేంకటేశ యింతలో న న్నేలితివి
మైకొని బత్తి సేసేవు మఱి యేమి సేతును

(||pallavi||)
illālam̐ ganaga nī yichchalone mĕlam̐genu
vĕlli viriyai vuṁḍagā vĕsa nemisedunu

(||illāla||)
vadda nuṁḍi vūm̐kŏneḍivāru galide nīvu
suddu lĕnnainām̐ jĕppevu sūḍibaḍanu
addugŏni yĕvattĕ pai yāsāsalano nīgu
niddura rāguṁḍidenu ne nemi sedunu

(||illāla||)
pavvaḽiṁchi nīvadda pāyaguṁḍevāru galide
navvu lĕnnainā navvevu naḍuma nīvu
javvanulam̐ gūḍi yāḍi saṁtosālu dalabosi
yivvala sumāḽa maide yiṁka ne nemi sedunu

(||illāla||)
logamulo sārĕ nīgu lonayyevāru galide
paigŏni radi sesevu paṁtāna nīvu
yīgaḍa śhrīveṁkaḍeśha yiṁtalo na nnelidivi
maigŏni batti sesevu maṟi yemi sedunu