ఇలమీఁద నివి గొన్ని యింద్రజాలాలా నీ
(॥పల్లవి॥)
ఇలమీఁద నివి గొన్ని యింద్రజాలాలా నీ-
కులుకు వలపు నాపై గురిసేయవలెనా
(॥ఇల॥)
యెదురై మొక్కేవు నాకు యేడలేనివినయాన
యిది గొంత ఆరడే నా కిందరిలోన
పొదివి నీవెఁ(వెం?) దైన భోగించి వచ్చి యీడ
వెదకి నాపైఁ జొప్పు వేయవలెనా
(॥ఇల॥)
పెట్టెడి నాపెండె మిది పెట్టుకొంటి విందరిలో
ముట్టి నాకు నిది గొంత మోచిదింపులా
గుట్టున నీచేఁతలును గుణములు వెడ్డువెట్టి
ఱట్టున మామాటలే యాఱడి సేయవలెనా
(॥ఇల॥)
ఇందాఁకా యేఁచి నన్ను యిప్పుడే శ్రీవేంకటేశ
పొందిలి విననయు నీకుఁ బొద్దువోకల
మందలించి నే నీకు మన్నించు సతి నింతే
అంది నాకు వింతప్రియము చెప్పవలెనా
(||pallavi||)
ilamīm̐da nivi gŏnni yiṁdrajālālā nī-
kulugu valabu nābai guriseyavalĕnā
(||ila||)
yĕdurai mŏkkevu nāgu yeḍalenivinayāna
yidi gŏṁta āraḍe nā kiṁdarilona
pŏdivi nīvĕm̐(vĕṁ?) daina bhogiṁchi vachchi yīḍa
vĕdagi nābaim̐ jŏppu veyavalĕnā
(||ila||)
pĕṭṭĕḍi nābĕṁḍĕ midi pĕṭṭugŏṁṭi viṁdarilo
muṭṭi nāgu nidi gŏṁta mosidiṁpulā
guṭṭuna nīsem̐talunu guṇamulu vĕḍḍuvĕṭṭi
ṟaṭṭuna māmāḍale yāṟaḍi seyavalĕnā
(||ila||)
iṁdām̐kā yem̐si nannu yippuḍe śhrīveṁkaḍeśha
pŏṁdili vinanayu nīgum̐ bŏdduvogala
maṁdaliṁchi ne nīgu manniṁchu sadi niṁte
aṁdi nāgu viṁtapriyamu sĕppavalĕnā