Ila natlane kadaa yekkuvalum dakkuvalu

ఇల నట్లనే కదా యెక్కువలుఁ దక్కువలు
Language

(॥పల్లవి॥)
ఇల నట్లనే కదా యెక్కువలుఁ దక్కువలు
కలవెల్ల భువి నిందు ఘనతలే కలిగే

(॥ఇల॥)
నడుము సన్నంబైన నలిఁ బిఱుఁదు ఘన మాయ
జడిసి కలిమికి లేమి సరికి సరియే
అడుగులే చిగురు గోళ్లందువే చేఁ గాయ
పడఁతి చలిమికి బలిమి పైపైనే కలిగే

(॥ఇల॥)
కొనచూపుదెలు పైన కొప్పు గడు నలుపాయ
నినుపుఁ జీఁకటికి వెన్నెలకు సరియే
వనితమోవియే చిగురు వజ్రాలే పలువరుస
ననిచి మ్చదువుకు వాడి నవ్వుచునే కలిగే

(॥ఇల॥)
చెలియ మతిమఱపైన చేఁత లధికం బాయ
కలయికలు వెలయికలు గడఁగి సరియే
వలచి శ్రీవేంకటేశ్వరుఁ డింతిఁ గూడఁగా
తలఁపునకుఁ దలఁపునకు తగులంబుగలిగే

(||pallavi||)
ila naṭlane kadā yĕkkuvalum̐ dakkuvalu
kalavĕlla bhuvi niṁdu ghanadale kalige

(||ila||)
naḍumu sannaṁbaina nalim̐ biṟum̐du ghana māya
jaḍisi kalimigi lemi sarigi sariye
aḍugule siguru goḽlaṁduve sem̐ gāya
paḍam̐ti salimigi balimi paibaine kalige

(||ila||)
kŏnasūbudĕlu paina kŏppu gaḍu nalubāya
ninubum̐ jīm̐kaḍigi vĕnnĕlagu sariye
vanidamoviye siguru vajrāle paluvarusa
nanisi mchaduvugu vāḍi navvusune kalige

(||ila||)
sĕliya madimaṟabaina sem̐ta ladhigaṁ bāya
kalayigalu vĕlayigalu gaḍam̐gi sariye
valasi śhrīveṁkaḍeśhvarum̐ ḍiṁtim̐ gūḍam̐gā
talam̐punagum̐ dalam̐punagu tagulaṁbugalige