ఇక్కువైన నీ రమణుఁ డెట్టుండినా నేమి
(॥పల్లవి॥)
ఇక్కువైన నీ రమణుఁ డెట్టుండినా నేమి
పెక్కు సతులు గలుగు ప్రియుఁడాతఁడు
(॥ఇక్కు॥)
వేమారు నాతని వెంగెములాడకువే
కామించియున్నసిగ్గరి యాతఁడు
చేముంచి కొనగోరఁ జిమ్ములు చిమ్మకువే
నేమముతో నుండేటి నిండుదొర యతఁడు
(॥ఇక్కు॥)
ఱట్టు సేసి యందరితో ఱంతుల నాడకునే
గుట్టుతోడనుండేటి గుణి యాతఁడు
చుట్టి చుట్టి యాతని మొయి సొదించి చూడకువే
నెట్టుకొన్న తప్పులేనినిజమరి యాతఁడు
(॥ఇక్కు॥)
కొచ్చికొచ్చి నీవంత కోరి కొసరకువే
ఇచ్చకుఁడు మొదలనే హితుఁ డాతఁడు
అచ్చపుటల మేల్మంగ నలయించకువే నిన్ను
విచ్చనవిడిఁ గూడె శ్రీవేంకటేశుఁ డతఁడు
(||pallavi||)
ikkuvaina nī ramaṇum̐ ḍĕṭṭuṁḍinā nemi
pĕkku sadulu galugu priyum̐ḍādam̐ḍu
(||ikku||)
vemāru nādani vĕṁgĕmulāḍaguve
kāmiṁchiyunnasiggari yādam̐ḍu
semuṁchi kŏnagoram̐ jimmulu simmaguve
nemamudo nuṁḍeḍi niṁḍudŏra yadam̐ḍu
(||ikku||)
ṟaṭṭu sesi yaṁdarido ṟaṁtula nāḍagune
guṭṭudoḍanuṁḍeḍi guṇi yādam̐ḍu
suṭṭi suṭṭi yādani mŏyi sŏdiṁchi sūḍaguve
nĕṭṭugŏnna tappuleninijamari yādam̐ḍu
(||ikku||)
kŏchchigŏchchi nīvaṁta kori kŏsaraguve
ichchagum̐ḍu mŏdalane hidum̐ ḍādam̐ḍu
achchabuḍala melmaṁga nalayiṁchaguve ninnu
vichchanaviḍim̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu