Ikkuva daamtinameemda nemi sesemu

ఇక్కువ దాఁటినమీఁద నేమి సేసేము
Language

(॥పల్లవి॥)
ఇక్కువ దాఁటినమీఁద నేమి సేసేము
చక్కని విభునిమీఁద చలముకోఁగలమా

(॥ఇక్కు॥)
వాడికెగా రమ్మంటి వచ్చీనో రాఁడో కాని
యీడ వుంగరము నాకు నిచ్చి పోయను
వేడుకకానిమనసు వేవేలచందాలఁ బారు
తోడితేరే వద్దనుండి తియ్యలులాల

(॥ఇక్కు॥)
తగిలి యాన వెట్టి తలఁచీనో లేదో కాని
నగుతా నిమ్మపం డిచ్చె నాచేతికి
మగవానివలపులు మ ట్టెరఁగఁగ రాదు
తగిలి పిలువరే తరుణులాల

(॥ఇక్కు॥)
పదివేలుగా మొక్కితి పరాకాయ నేమో కాని
యెదుటనే సన్న సేసె యిప్పుడు నాతో
కదిసి కూడెను శ్రీ వేంకటపతి యిదె నన్ను
పొదిగి సేవ సేయరే పొలఁతులాలా

(||pallavi||)
ikkuva dām̐ṭinamīm̐da nemi sesemu
sakkani vibhunimīm̐da salamugom̐galamā

(||ikku||)
vāḍigĕgā rammaṁṭi vachchīno rām̐ḍo kāni
yīḍa vuṁgaramu nāgu nichchi poyanu
veḍugagānimanasu vevelasaṁdālam̐ bāru
toḍidere vaddanuṁḍi tiyyalulāla

(||ikku||)
tagili yāna vĕṭṭi talam̐sīno ledo kāni
nagudā nimmabaṁ ḍichchĕ nāsedigi
magavānivalabulu ma ṭṭĕram̐gam̐ga rādu
tagili piluvare taruṇulāla

(||ikku||)
padivelugā mŏkkidi parāgāya nemo kāni
yĕduḍane sanna sesĕ yippuḍu nādo
kadisi kūḍĕnu śhrī veṁkaḍabadi yidĕ nannu
pŏdigi seva seyare pŏlam̐tulālā