ఇక్కడను వింతవారు యెవ్వ రున్నారు
(॥పల్లవి॥)
ఇక్కడను వింతవారు యెవ్వ రున్నారు
గక్కనను మన్నించఁగదవయ్య యింతిని
(॥॥)
తేనెల వంటి మాటలు తెర మఱఁగు సిగ్గులు
కానుక వట్టీ నీకుఁగలికి
మైనము వంటిది నీ మనసందుకెల్లాఁ దగు
కానిమ్మని పిలుచుకోఁ గదవయ్య వద్దికి
(॥॥)
కప్పురము వంటి నవ్వు కాతరపుఁ దమకము
కుప్పళించీ నీ పయిఁ గోమలి
వుప్పువంటిది నీ వల పూరఁ బెట్టి తేఁజవొ
చిప్పిలఁ గౌఁగిటఁ జేర్చి చెప్పవయ్య ప్రియమూ
(॥॥)
పాలువంటి చూపులును పానుపుపై సరసాలు
మేలు చూపి నిన్నుఁ గూడె మెలఁతా
ఔలే చెఱకు వంటిది అన్నిటి కోపు నీరతి
యీ లీల శ్రీ వేంకటేశ యేలవయ్య రాజ్యమూ
(||pallavi||)
ikkaḍanu viṁtavāru yĕvva runnāru
gakkananu manniṁcham̐gadavayya yiṁtini
(||||)
tenĕla vaṁṭi māḍalu tĕra maṟam̐gu siggulu
kānuga vaṭṭī nīgum̐galigi
mainamu vaṁṭidi nī manasaṁdugĕllām̐ dagu
kānimmani pilusugom̐ gadavayya vaddigi
(||||)
kappuramu vaṁṭi navvu kādarabum̐ damagamu
kuppaḽiṁchī nī payim̐ gomali
vuppuvaṁṭidi nī vala pūram̐ bĕṭṭi tem̐javŏ
sippilam̐ gaum̐giḍam̐ jersi sĕppavayya priyamū
(||||)
pāluvaṁṭi sūbulunu pānububai sarasālu
melu sūbi ninnum̐ gūḍĕ mĕlam̐tā
aule sĕṟagu vaṁṭidi anniḍi kobu nīradi
yī līla śhrī veṁkaḍeśha yelavayya rājyamū