ఇక్కడ నేమి సేసేవు యెంతపని గద్దు నీకు
(॥పల్లవి॥)
ఇక్కడ నేమి సేసేవు యెంతపని గద్దు నీకు
గక్కన నాపె మేలు కందువు రారాదా
(॥ఇక్క॥)
చెక్కుచేతితోడిచింత చిరిచేఁదులవంత
ముక్కువీఁది వేలు మరుముంగిటివాలు
అక్కజపులతలపోఁత అజుఁడు వాసినవాత
చొక్కపు నీసతిలాగు చూతువు రారాదా
(॥ఇక్క॥)
తప్ప చూచేటి చూపు తడఁబాటుతోదోవు
ముప్పిరిశిరసువంపు మోచిదింపు
చిప్పిల సిగ్గులమొక్క చిత్తజుఁ డిడిన చిక్కు
చొప్పుగ నీఇంతిలాగు చూతువు రారాదా
(॥ఇక్క॥)
చెదరునిరిఁగురులు చిమ్ముఁగూటపుగురులు
పొదిగొన్న అడియాస వూఁచినసేస
యిదివో శ్రీవేంకటేశ యింతలో బెండ్లాడితివి
సుదతి, నీదేవిలాగు చూతువు రారాదా
(||pallavi||)
ikkaḍa nemi sesevu yĕṁtabani gaddu nīgu
gakkana nābĕ melu kaṁduvu rārādā
(||ikka||)
sĕkkusedidoḍisiṁta sirisem̐dulavaṁta
mukkuvīm̐di velu marumuṁgiḍivālu
akkajabuladalabom̐ta ajum̐ḍu vāsinavāda
sŏkkabu nīsadilāgu sūduvu rārādā
(||ikka||)
tappa sūseḍi sūbu taḍam̐bāḍudodovu
muppiriśhirasuvaṁpu mosidiṁpu
sippila siggulamŏkka sittajum̐ ḍiḍina sikku
sŏppuga nīiṁtilāgu sūduvu rārādā
(||ikka||)
sĕdarunirim̐gurulu simmum̐gūḍabugurulu
pŏdigŏnna aḍiyāsa vūm̐sinasesa
yidivo śhrīveṁkaḍeśha yiṁtalo bĕṁḍlāḍidivi
sudadi, nīdevilāgu sūduvu rārādā