Ikkada nakkada sare yemdaaya nemi

ఇక్కడ నక్కడ సరె యెందాయ నేమి
Language

(॥పల్లవి॥)
ఇక్కడ నక్కడ సరె యెందాయ నేమి
మిక్కిలి చెలియపొందు మేలు నీకు రావయ్యా

(॥ఇక్క॥)
తమితోడఁ బాలసముద్రముమీఁదఁ బవళించి
విమలుఁడవై యుండేటివేడుకకాఁడ
చెమటలసముద్రము చెలిమేన నున్న దిదె
ప్రమదాన నీవు నేఁడు పవళింతు రావయ్యా

(॥ఇక్క॥)
చెలఁగి యాకసమెల్లా శ్రీపాదమున నే
కొలుచుకొంటా నుండేటికోడెకాఁడ
నలువున నీయింతినడిమియాకస మిదె
కొలఁదిమిగుల నిట్టె కొలతు రావయ్యా

(॥ఇక్క॥)
శ్రీవేంకటేఁడశువై చిత్తగించి కొమ్మతో
యీవలఁ గొండపై నుండేటియెమ్మెకాఁడ
తావి నలమేల్మంగ తగుఁగుచగిరు లివి
వోవరిఁ గూడితి విందే వుందు విట్టే రావయ్యా

(||pallavi||)
ikkaḍa nakkaḍa sarĕ yĕṁdāya nemi
mikkili sĕliyabŏṁdu melu nīgu rāvayyā

(||ikka||)
tamidoḍam̐ bālasamudramumīm̐dam̐ bavaḽiṁchi
vimalum̐ḍavai yuṁḍeḍiveḍugagām̐ḍa
sĕmaḍalasamudramu sĕlimena nunna didĕ
pramadāna nīvu nem̐ḍu pavaḽiṁtu rāvayyā

(||ikka||)
sĕlam̐gi yāgasamĕllā śhrībādamuna ne
kŏlusugŏṁṭā nuṁḍeḍigoḍĕgām̐ḍa
naluvuna nīyiṁtinaḍimiyāgasa midĕ
kŏlam̐dimigula niṭṭĕ kŏladu rāvayyā

(||ikka||)
śhrīveṁkaḍem̐ḍaśhuvai sittagiṁchi kŏmmado
yīvalam̐ gŏṁḍabai nuṁḍeḍiyĕmmĕgām̐ḍa
tāvi nalamelmaṁga tagum̐gusagiru livi
vovarim̐ gūḍidi viṁde vuṁdu viṭṭe rāvayyā