(॥పల్లవి॥)
ఇహమేకాని యిఁకఁ బరమేకాని
బహుళమై హరి నీపై భక్తే చాలు
(॥ఇహ॥)
యెందు జనించిన నేమి యెచ్చోట నున్న నేమి
కందువ నీదాస్యము గలిగితేఁ జాలు
అంది స్వర్గమేకాని అల నరకమేకాని
అందపు నీనామము నా కబ్బుటేచాలు
(॥ఇహ॥)
దొరయైనఁ జాలు గడుఁ దుచ్ఛపు బంటైనఁ జాలు
కరఁగి నిన్నుఁ దలఁచఁగలితేఁ జాలు
పరులు మెచ్చిన మేలు పమ్మి దూషించిన మేలు
హరి నీసేవాపరుఁడౌటే చాలు
(॥ఇహ॥)
యిలఁ జదువులు రానీ యిటు రాక మాననీ
తలఁపు నీపాదముల తగులే చాలు
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చలపట్టి నాకు నీశరణమే చాలు
(||pallavi||)
ihamegāni yim̐kam̐ baramegāni
bahuḽamai hari nībai bhakte sālu
(||iha||)
yĕṁdu janiṁchina nemi yĕchchoḍa nunna nemi
kaṁduva nīdāsyamu galigidem̐ jālu
aṁdi svargamegāni ala naragamegāni
aṁdabu nīnāmamu nā kabbuḍesālu
(||iha||)
dŏrayainam̐ jālu gaḍum̐ duchchhabu baṁṭainam̐ jālu
karam̐gi ninnum̐ dalam̐sam̐galidem̐ jālu
parulu mĕchchina melu pammi dūṣhiṁchina melu
hari nīsevābarum̐ḍauḍe sālu
(||iha||)
yilam̐ jaduvulu rānī yiḍu rāga mānanī
talam̐pu nībādamula tagule sālu
yĕlami śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
salabaṭṭi nāgu nīśharaṇame sālu