(॥పల్లవి॥)
ఇహపరసాధన మీ తలఁపు
సహజజ్ఞానికి సత మీ తలఁపు
(॥ఇహ॥)
సిరులు ముంగిటను జిగిఁ దడఁబడఁగా
హరిని మఱువనిది యది దలఁపు
సరిఁ గాంతలెదుట సందడిగొనఁగా
తిరమయి భ్రమయనిదే తలఁపు
(॥ఇహ॥)
వొడలి వయోమద ముప్పతిల్లినను
అడఁచి మెలుగుట యది దలఁపు
కడఁగుచు సుఖదుఃఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలఁపు
(॥ఇహ॥)
మతి సంసారపుమాయ గప్పినను
అతికాంక్షఁ జొరనిదది తలఁపు
గతియై శ్రీవేంకటపతి గాచిన
సతతము నితనిశరణమే తలఁపు
(||pallavi||)
ihabarasādhana mī talam̐pu
sahajajñānigi sada mī talam̐pu
(||iha||)
sirulu muṁgiḍanu jigim̐ daḍam̐baḍam̐gā
harini maṟuvanidi yadi dalam̐pu
sarim̐ gāṁtalĕduḍa saṁdaḍigŏnam̐gā
tiramayi bhramayanide talam̐pu
(||iha||)
vŏḍali vayomada muppadillinanu
aḍam̐si mĕluguḍa yadi dalam̐pu
kaḍam̐gusu sukhaduḥkhamulu muṁchinanu
jaḍiyani nāmasmaraṇame talam̐pu
(||iha||)
madi saṁsārabumāya gappinanu
adigāṁkṣham̐ jŏranidadi talam̐pu
gadiyai śhrīveṁkaḍabadi gāsina
sadatamu nidaniśharaṇame talam̐pu