Ihabaramulagunu yeligavu

ఇహపరములకును యేలికవు
Language

(॥పల్లవి॥)
ఇహపరములకును యేలికవు
బహురూపంబుల ప్రహ్లాదవరదా

(॥ఇహ॥)
వేయిగరంబుల వివిధాయుధంబుల
దాయల నడఁచిన దైవమవూ
నీయందు నున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరదా

(॥ఇహ॥)
కదిమి దుష్టులను గతము సేసితివి
త్రిదశులఁ గాచిన దేవుఁడవు
వదల కిందరికి వరము లొసంగఁగ
బ్రదికితి మిదివో ప్రహ్లాదవరదా

(॥ఇహ॥)
శ్రీ వల్లభుఁడవు చిత్తజగురుఁడవు
కావలసినచోఁ గలుగుదువు
శ్రీవేంకటాద్రిని శ్రీయహోబలానను
భావింతు నీమూర్తి ప్రహ్లాదవరదా

(||pallavi||)
ihabaramulagunu yeligavu
bahurūbaṁbula prahlādavaradā

(||iha||)
veyigaraṁbula vividhāyudhaṁbula
dāyala naḍam̐sina daivamavū
nīyaṁdu nunnavi nikhila jagaṁbulu
pāyaga mammelu prahlādavaradā

(||iha||)
kadimi duṣhṭulanu gadamu sesidivi
tridaśhulam̐ gāsina devum̐ḍavu
vadala kiṁdarigi varamu lŏsaṁgam̐ga
bradigidi midivo prahlādavaradā

(||iha||)
śhrī vallabhum̐ḍavu sittajagurum̐ḍavu
kāvalasinasom̐ galuguduvu
śhrīveṁkaḍādrini śhrīyahobalānanu
bhāviṁtu nīmūrdi prahlādavaradā