ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితి
(॥పల్లవి॥)
ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు సేసితి
తటుకన నీవనే నిధానము చేకొంటిని
(॥ఇటు॥)
కామించితి నాత్మ నిన్నుఁ గలసి భోగించుటకు
వేమరుఁ గ్రోధించితి నీవిరోధులపై
నేమమున లోభించితి నీమంత్రమన్యుల కియ్య
ఆముకొని మోహించితి హరి నీరూపునకు
(॥ఇటు॥)
యెఱుకతో మదించితి యిట్టే నీదాస్యమున
మఱి నిన్నొల్లని చదువు మచ్చరించితి
తఱిఁ జలపట్టితి నీతప్పని భ క్తియందు
వెఱవక నిన్నొల్లని విధుల నిందించితి
(॥ఇటు॥)
కల కర్మములెల్లా నీకైంకర్యములందు వెట్టితి
బలు మమకారము నీపైఁ జేర్చితిఁ
యెలిమి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
నిలిచిన కాలమెల్లా నీసేవే చేసితి
(||pallavi||)
iḍuvaṁṭivĕllā nīge yiṭṭe sĕlavu sesidi
taḍugana nīvane nidhānamu segŏṁṭini
(||iḍu||)
kāmiṁchidi nātma ninnum̐ galasi bhogiṁchuḍagu
vemarum̐ grodhiṁchidi nīvirodhulabai
nemamuna lobhiṁchidi nīmaṁtramanyula kiyya
āmugŏni mohiṁchidi hari nīrūbunagu
(||iḍu||)
yĕṟugado madiṁchidi yiṭṭe nīdāsyamuna
maṟi ninnŏllani saduvu machchariṁchidi
taṟim̐ jalabaṭṭidi nīdappani bha ktiyaṁdu
vĕṟavaga ninnŏllani vidhula niṁdiṁchidi
(||iḍu||)
kala karmamulĕllā nīgaiṁkaryamulaṁdu vĕṭṭidi
balu mamagāramu nībaim̐ jersidim̐
yĕlimi śhrīveṁkaḍeśha yinniḍā nannelidivi
nilisina kālamĕllā nīseve sesidi