Iduvamtivaari pomdulimpulaaya neegu

ఇటువంటివారి పొందులింపులాయ నీకు
Language

(॥పల్లవి॥)
ఇటువంటివారి పొందులింపులాయ నీకు
అటమటాలు నేమైతే నంతేసి నేరముగా

(॥ఇటు॥)
బిగువుఁగొనగోళ్ళను బిరుదులే తొలఁకీని
మొగమిచ్చకుఁ జేతులు మొక్కీఁ గాని
తెగువలు కన్నులను తేరి కెంపులెక్కీని
నగవులే సెలవుల నయమిచ్చీఁ గాని

(॥ఇటు॥)
గట్టి చను మొనలైతే కరసానఁ బట్టీని
వొట్టుక మాటలె తేనెలూరీఁ గాని
జట్టిగొన్న బొమ్మలైతే జంకెనలే చూపీని
దట్టపుఁ జక్కఁదనమే తమిరేఁచీఁ గాని

(॥ఇటు॥)
మచ్చిక జవ్వనమైతే మనసెల్లాఁ గరఁచీని
కొచ్చి కోరికలే ఆస కొలిపీఁ గాని
అచ్చపు శ్రీ వేంకటేశ అలమేల్‌మంగను నేను
నిచ్చలుఁ గూడితి నాపె నిన్నుఁ గూడెఁ గాని

(||pallavi||)
iḍuvaṁṭivāri pŏṁduliṁpulāya nīgu
aḍamaḍālu nemaide naṁtesi neramugā

(||iḍu||)
biguvum̐gŏnagoḽḽanu birudule tŏlam̐kīni
mŏgamichchagum̐ jedulu mŏkkīm̐ gāni
tĕguvalu kannulanu teri kĕṁpulĕkkīni
nagavule sĕlavula nayamichchīm̐ gāni

(||iḍu||)
gaṭṭi sanu mŏnalaide karasānam̐ baṭṭīni
vŏṭṭuga māḍalĕ tenĕlūrīm̐ gāni
jaṭṭigŏnna bŏmmalaide jaṁkĕnale sūbīni
daṭṭabum̐ jakkam̐daname tamirem̐sīm̐ gāni

(||iḍu||)
machchiga javvanamaide manasĕllām̐ garam̐sīni
kŏchchi korigale āsa kŏlibīm̐ gāni
achchabu śhrī veṁkaḍeśha alamel‌maṁganu nenu
nichchalum̐ gūḍidi nābĕ ninnum̐ gūḍĕm̐ gāni