Iduvamtivaarala nettu bodhimchamga vachchu

ఇటువంటివారల నెట్టు బోధించఁగ వచ్చు
Language

(॥పల్లవి॥)
ఇటువంటివారల నెట్టు బోధించఁగ వచ్చు
కుటిలపు బుద్ధులచే కుందుదురు తాము

(॥ఇటు॥)
పాపపుణ్యకర్మదేహి పసిరికాయపురువు
కూపములోనికప్ప దుర్గుణబద్ధుఁడు
దీపము వేఁటమృగము తెగని యాసోదకాఁడు
దూపము కాకి భక్తి యెందును లేని వాఁడు

(॥ఇటు॥)
మతిచంచలపువాఁడు మద్దెలలోని యెలుక
వ్రతియై కోరెడువాఁడు వలలో మీను
కుతిలపు టహంకారి గుండెమీఁది చింబోతు
అతికాముకుఁడు జిగు రంటుకొన్న పికిలి

(॥ఇటు॥)
దేవతాంతరపరుఁడు తేనెలోఁ బడిన యీఁగ
భావించి కావనివాఁడు బెసి కొక్కెర
శ్రీవేంకటాధీశ్వరు సేవించక మోక్షానకుఁ
బోవల ననేటివాఁడు బూరగుపై చిలుకా

(||pallavi||)
iḍuvaṁṭivārala nĕṭṭu bodhiṁcham̐ga vachchu
kuḍilabu buddhulase kuṁduduru tāmu

(||iḍu||)
pābabuṇyagarmadehi pasirigāyaburuvu
kūbamulonigappa durguṇabaddhum̐ḍu
dībamu vem̐ṭamṛgamu tĕgani yāsodagām̐ḍu
dūbamu kāgi bhakti yĕṁdunu leni vām̐ḍu

(||iḍu||)
madisaṁchalabuvām̐ḍu maddĕlaloni yĕluga
vradiyai korĕḍuvām̐ḍu valalo mīnu
kudilabu ṭahaṁkāri guṁḍĕmīm̐di siṁbodu
adigāmugum̐ḍu jigu raṁṭugŏnna pigili

(||iḍu||)
devadāṁtarabarum̐ḍu tenĕlom̐ baḍina yīm̐ga
bhāviṁchi kāvanivām̐ḍu bĕsi kŏkkĕra
śhrīveṁkaḍādhīśhvaru seviṁchaga mokṣhānagum̐
bovala naneḍivām̐ḍu būragubai silugā