Iduvamtivaani ninu nettu geluvamga vachchu

ఇటువంటివాని నిను నెట్టు గెలువఁగ వచ్చు
Language

(॥పల్లవి॥)
ఇటువంటివాని నిను నెట్టు గెలువఁగ వచ్చు
తటుకున నిన్నిటాను తప్పు లేదనేవు

(॥ఇటు॥)
చేరి యెందుండో రాఁగాఁ జేయి వట్టుకొని నిన్ను
తారుకాణ చేసినాఁ దప్పు లేదనేవు
మారుముద్రలు నీమేన మచ్చములు చూపినాను
దార దప్పకుండానుఁ దప్పులేదనేవు

(॥ఇటు॥)
పెండిలిపీఁటపై నీవు ప్రియముతోఁ గూచుండఁగా
దండములు వెట్టినాఁ దప్పు లేదనేవు
నిండు వింతవాసనలు నీవల్ల నుండఁగాను
దండి చేసుకడిగినాఁ దప్పు లేదనేవు

(॥ఇటు॥)
మిగులా నన్నుఁ గూడి మించాపెమోము చూడఁగా
తగవు నిన్నడిగినాఁ దప్పు లేదనేవు
నిగిడి శ్రీవేంకటాద్రినిలయ గోవిందరాజ
దగ యేలతొట్టెనంటేఁ దప్పు లేదనేవు

(||pallavi||)
iḍuvaṁṭivāni ninu nĕṭṭu gĕluvam̐ga vachchu
taḍuguna ninniḍānu tappu ledanevu

(||iḍu||)
seri yĕṁduṁḍo rām̐gām̐ jeyi vaṭṭugŏni ninnu
tārugāṇa sesinām̐ dappu ledanevu
mārumudralu nīmena machchamulu sūbinānu
dāra dappaguṁḍānum̐ dappuledanevu

(||iḍu||)
pĕṁḍilibīm̐ṭabai nīvu priyamudom̐ gūsuṁḍam̐gā
daṁḍamulu vĕṭṭinām̐ dappu ledanevu
niṁḍu viṁtavāsanalu nīvalla nuṁḍam̐gānu
daṁḍi sesugaḍiginām̐ dappu ledanevu

(||iḍu||)
migulā nannum̐ gūḍi miṁchābĕmomu sūḍam̐gā
tagavu ninnaḍiginām̐ dappu ledanevu
nigiḍi śhrīveṁkaḍādrinilaya goviṁdarāja
daga yeladŏṭṭĕnaṁṭem̐ dappu ledanevu