Iduvamtivaamdu taanu yeduraadenaa nenu

ఇటువంటివాఁడు తాను యెదురాడేనా నేను
Language

(॥పల్లవి॥)
ఇటువంటివాఁడు తాను యెదురాడేనా నేను
చిటుకనఁ జెప్పినట్టు సేసేనే తనకు

(॥॥)
వినయము సేసే చోట వెంగెము లాడఁగరాదు
చన విచ్చిన చోటను జరయరాదు
మనసొక్కటైన చోట మంకులు చూపఁగరాదు
ననువులు గలిగితే నమ్మకుండరాదూ

(॥॥)
ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననఁగరాదు
క్రియ గల పొందులు తగ్గించఁగరాదు
నయ మిచ్చి మాటాడఁగా నవ్వక మానరాదు
దయతోఁ దగులఁ గాను దాఁ గఁ గరాదు

(॥॥)
పచ్చి దేరఁ గూడఁగాను పంతము లడుగరాదు
కచ్చుపెట్టి చెనకఁ గాఁ గాదనరాదు
ఇచ్చట శ్రీ వేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
మెచ్చి సరసమాడఁ గా మితి మీఱరాదు

(||pallavi||)
iḍuvaṁṭivām̐ḍu tānu yĕdurāḍenā nenu
siḍuganam̐ jĕppinaṭṭu sesene tanagu

(||||)
vinayamu sese soḍa vĕṁgĕmu lāḍam̐garādu
sana vichchina soḍanu jarayarādu
manasŏkkaḍaina soḍa maṁkulu sūbam̐garādu
nanuvulu galigide nammaguṁḍarādū

(||||)
priyamu sĕppeyappuḍu bigisĕ nanam̐garādu
kriya gala pŏṁdulu taggiṁcham̐garādu
naya michchi māḍāḍam̐gā navvaga mānarādu
dayadom̐ dagulam̐ gānu dām̐ gam̐ garādu

(||||)
pachchi deram̐ gūḍam̐gānu paṁtamu laḍugarādu
kachchubĕṭṭi sĕnagam̐ gām̐ gādanarādu
ichchaḍa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
mĕchchi sarasamāḍam̐ gā midi mīṟarādu