ఇటువంటిచేఁతలనె ఇన్నిటా నే వలచితి
(॥పల్లవి॥)
ఇటువంటిచేఁతలనె ఇన్నిటా నే వలచితి
విటరాయ నిన్నుఁ జూచి వేడుకాయనయ్యా
(॥ఇటు॥)
మనసిచ్చి మాటాడి మర్మములు రేఁచేవు
కనువిచ్చి చూచి మతి గరఁగించేవు
చెనకుచు పలుమారు సిగ్గులు వుట్చించేవు
యెనసి పొందులుసేయ నెంతనేర్తువయ్యా
(॥ఇటు॥)
చెక్కునొక్కి బుజ్జగించి సెలవుల నవ్వించేవు
చిక్కనిచన్నులు ముట్టి చెలఁగించేవు
చక్కెరమోవి చూపి సారె నోరూరించేవు
యిక్కువలంటి మెప్పించ నెంతనేర్తువయ్యా
(॥ఇటు॥)
చుట్టరికములు చెప్పి సొంపున నుబ్బించేవు
దట్టముగ సేసచల్లి తమి నించేవు
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విదె నన్ను
యెట్టనెదుట లాలించ నెంతనేర్తువయ్యా
(||pallavi||)
iḍuvaṁṭisem̐talanĕ inniḍā ne valasidi
viḍarāya ninnum̐ jūsi veḍugāyanayyā
(||iḍu||)
manasichchi māḍāḍi marmamulu rem̐sevu
kanuvichchi sūsi madi garam̐giṁchevu
sĕnagusu palumāru siggulu vuṭchiṁchevu
yĕnasi pŏṁduluseya nĕṁtanerduvayyā
(||iḍu||)
sĕkkunŏkki bujjagiṁchi sĕlavula navviṁchevu
sikkanisannulu muṭṭi sĕlam̐giṁchevu
sakkĕramovi sūbi sārĕ norūriṁchevu
yikkuvalaṁṭi mĕppiṁcha nĕṁtanerduvayyā
(||iḍu||)
suṭṭarigamulu sĕppi sŏṁpuna nubbiṁchevu
daṭṭamuga sesasalli tami niṁchevu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi vidĕ nannu
yĕṭṭanĕduḍa lāliṁcha nĕṁtanerduvayyā