ఇటువంటిది గలదా యేలికవు నీవు మాకు
(॥పల్లవి॥)
ఇటువంటిది గలదా యేలికవు నీవు మాకు
యిటులా నూడిగము సేయించుకొంటగా
(॥ఇటు॥)
నవ్వు లెన్ని లేవునీవు నాతోనే జరపేవి
పువ్వు లెన్ని లేవు నాపైఁ బూఁచి వేసేవి
యివ్వలనే లోనౌదునా యెంత చెప్పినా నీకు
జవ్వనపుమాయేలికసాని వుండఁగాను
(॥ఇటు॥)
మాట లెన్ని లేవు నీవు మంతనాన నాడేవి
చీటు లెన్నిలేవు నవు వ్రాసి చేతికిచ్చేవి
పాటించి ఇయ్యకొందునా పచ్చిగా నీపనులకు
చాటువగా మాయేలికసాని వుండఁగా
(॥ఇటు॥)
చూపు లెన్ని లేవు నీవు సొలయుచుఁ జూచేవి
తీపు లెన్ని లేవు సాదించి చల్లేవి
యేపున శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
చానఁ మీదనే యేలికసాని వుండఁగాను
(||pallavi||)
iḍuvaṁṭidi galadā yeligavu nīvu māgu
yiḍulā nūḍigamu seyiṁchugŏṁṭagā
(||iḍu||)
navvu lĕnni levunīvu nādone jarabevi
puvvu lĕnni levu nābaim̐ būm̐si vesevi
yivvalane lonaudunā yĕṁta sĕppinā nīgu
javvanabumāyeligasāni vuṁḍam̐gānu
(||iḍu||)
māḍa lĕnni levu nīvu maṁtanāna nāḍevi
sīḍu lĕnnilevu navu vrāsi sedigichchevi
pāḍiṁchi iyyagŏṁdunā pachchigā nībanulagu
sāḍuvagā māyeligasāni vuṁḍam̐gā
(||iḍu||)
sūbu lĕnni levu nīvu sŏlayusum̐ jūsevi
tību lĕnni levu sādiṁchi sallevi
yebuna śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭĕ
sānam̐ mīdane yeligasāni vuṁḍam̐gānu