ఇటువంటిదే పో యెదిరిఁ జేసిన చేఁత
(॥పల్లవి॥)
ఇటువంటిదే పో యెదిరిఁ జేసిన చేఁత
ఘటన నట్టె తనకుఁ గలుగక పోదు
(॥ఇటు॥)
వలపులు కడుఁజూపి వాడికలుపచరించి
పలుమారు రమణుని భ్రమఇంచేవు
బలిమినే నీవిట్లా పంతాలు మెరయఁగానే
చెలపచెమటలు నీచెక్కిళ్ల నిండెఁగదా
(॥ఇటు॥)
తమకములు గొనవేసి తాలిములు ధూపించి
జమళివలపులఁ బతి సాదించేవు
సముకాన నీబింకాలు సారెకు నెరపఁగానే
కొమరెమదము నిన్ను గొబ్బున ముంచెఁగదే
(॥ఇటు॥)
భావించి చూపు చూచి పైనై వినయాలు చేసి
శ్రీవేంకటేశ్వరుఁ గూడి చిత్తగించేవు
సావధానమున రతిసాములు సేయఁగానే
నీ వలమేల్మంగవు నేర్చితివిగదవే
(||pallavi||)
iḍuvaṁṭide po yĕdirim̐ jesina sem̐ta
ghaḍana naṭṭĕ tanagum̐ galugaga podu
(||iḍu||)
valabulu kaḍum̐jūbi vāḍigalubasariṁchi
palumāru ramaṇuni bhrama̮iṁchevu
balimine nīviṭlā paṁtālu mĕrayam̐gāne
sĕlabasĕmaḍalu nīsĕkkiḽla niṁḍĕm̐gadā
(||iḍu||)
tamagamulu gŏnavesi tālimulu dhūbiṁchi
jamaḽivalabulam̐ badi sādiṁchevu
samugāna nībiṁkālu sārĕgu nĕrabam̐gāne
kŏmarĕmadamu ninnu gŏbbuna muṁchĕm̐gade
(||iḍu||)
bhāviṁchi sūbu sūsi painai vinayālu sesi
śhrīveṁkaḍeśhvarum̐ gūḍi sittagiṁchevu
sāvadhānamuna radisāmulu seyam̐gāne
nī valamelmaṁgavu nersidivigadave