ఇటువంటిదౌత వల పెరఁగ నిన్నాళ్ళును
(॥పల్లవి॥)
ఇటువంటిదౌత వల పెరఁగ నిన్నాళ్ళును
తటుకన రాఁగా రాఁగా తరితీపులాయను
(॥ఇటు॥)
వెలనున్నయంతపడి విరహములై యుండి
కలసినమీఁదట కలయై తోఁచె
తలఁచినయంతవడి తమకములై నిండి
సులభానఁ దనువులు సోఁకితే వేడుకాయ
(॥ఇటు॥)
వినుకలియంతవడి వెడయాసలై ముంచి
కనుకలిఁ దనియందె కాయమెల్లాను
పెనఁగినయంతవడి బీరములు నాటుకొని
చనవిచ్చితేఁ గడుచవులౌ మెరసెను
(॥ఇటు॥)
చెంగటనున్నంతవడి సిగ్గులు మిక్కిలిరేఁగి
ముంగిటఁ గాఁగిలించితే ముచ్చటలాయ
రంగుగ నే నలమేలుమంగను శ్రీవేంకటేశ
అంగవించి నీ వేలితి వందాలాయ రతులు
(||pallavi||)
iḍuvaṁṭidauda vala pĕram̐ga ninnāḽḽunu
taḍugana rām̐gā rām̐gā taridībulāyanu
(||iḍu||)
vĕlanunnayaṁtabaḍi virahamulai yuṁḍi
kalasinamīm̐daḍa kalayai tom̐sĕ
talam̐sinayaṁtavaḍi tamagamulai niṁḍi
sulabhānam̐ danuvulu som̐kide veḍugāya
(||iḍu||)
vinugaliyaṁtavaḍi vĕḍayāsalai muṁchi
kanugalim̐ daniyaṁdĕ kāyamĕllānu
pĕnam̐ginayaṁtavaḍi bīramulu nāḍugŏni
sanavichchidem̐ gaḍusavulau mĕrasĕnu
(||iḍu||)
sĕṁgaḍanunnaṁtavaḍi siggulu mikkilirem̐gi
muṁgiḍam̐ gām̐giliṁchide muchchaḍalāya
raṁguga ne nalamelumaṁganu śhrīveṁkaḍeśha
aṁgaviṁchi nī velidi vaṁdālāya radulu