Iduvamtidaana naa kemtiyaluge

ఇటువంటిదాన నా కేఁటియలుకే
Language

(॥పల్లవి॥)
ఇటువంటిదాన నా కేఁటియలుకే
కటకట తా రాఁగాఁ గాదనేనా నేను

(॥॥)
మాటలాడకుండుఁగాని, మనలోపలనైతే
నాటినది తనమీఁద నాచిత్తము
కాటుకకన్నులఁ జూచి కరుదుఁగాని నేను
వాఁటపువలపు మీఁద వంతుఁబో లోలోనే

(॥॥)
దగ్గరి రాకుందుఁగాని, తానన్ను నంటినప్పుడే
వెగ్గళించి సిగ్గులెల్లా వీడఁగలవే
యెగ్గువట్టివుందుఁగాని, యేపాటి నవ్వించినాను
అగ్గలపుసరసము లాడుదుఁబో నేను

(॥॥)
నివ్వెర గందితిఁ గాని, నేఁడు నన్నుఁ గూడఁగాను
పవ్వళించినపుడేపో పరవశము
యివ్వల శ్రీవేంకటేశుఁడేకతమాయ నాతోను
జవ్వనబారముచేత జడిసీఁబో తనువు

(||pallavi||)
iḍuvaṁṭidāna nā kem̐ṭiyaluge
kaḍagaḍa tā rām̐gām̐ gādanenā nenu

(||||)
māḍalāḍaguṁḍum̐gāni, manalobalanaide
nāḍinadi tanamīm̐da nāsittamu
kāḍugagannulam̐ jūsi karudum̐gāni nenu
vām̐ṭabuvalabu mīm̐da vaṁtum̐bo lolone

(||||)
daggari rāguṁdum̐gāni, tānannu naṁṭinappuḍe
vĕggaḽiṁchi siggulĕllā vīḍam̐galave
yĕgguvaṭṭivuṁdum̐gāni, yebāḍi navviṁchinānu
aggalabusarasamu lāḍudum̐bo nenu

(||||)
nivvĕra gaṁdidim̐ gāni, nem̐ḍu nannum̐ gūḍam̐gānu
pavvaḽiṁchinabuḍebo paravaśhamu
yivvala śhrīveṁkaḍeśhum̐ḍegadamāya nādonu
javvanabāramuseda jaḍisīm̐bo tanuvu