ఇటువంటి యాగడీని నేమి సేతునే
(॥పల్లవి॥)
ఇటువంటి యాగడీని నేమి సేతునే
నటన నాపె బాసకు నాపై నానవెట్టీనే
(॥ఇటువంటి॥)
నమ్మి యడమాటలాడే, నామోవి ముట్టి నేలంటే
కొమ్మమాటకు నా మోవి గుఱి యనీనే
చిమ్మి కానుక లియ్యఁగా చెయ్యాల పట్టే వంటే
వుమ్మడి నాపెకానిక కొడిగట్టె ననీనే
(॥ఇటువంటి॥)
దూతికనై మొక్కే నాతురు మేల పట్టే వంటే
రీతి నాపెమొక్కులే ధరించే ననీవే
నాతిఁ జెనకఁ బిలిచె, నా మర్మమే లంటే వంటే
యేతుల నాపెమర్మాలే యీడ నున్న ననీనే
(॥ఇటువంటి॥)
పూడిగ మిద్దరికిని వొసరఁ బాన్పు వేసితే
వేడుక నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడే
జోడుగాఁ గూడే వాకెకు సుద్ది చెప్పి వచ్చే నంటే
జాడతోఁ దానె సుద్దులు సకియకుఁ జెప్పీనే
(||pallavi||)
iḍuvaṁṭi yāgaḍīni nemi sedune
naḍana nābĕ bāsagu nābai nānavĕṭṭīne
(||iḍuvaṁṭi||)
nammi yaḍamāḍalāḍe, nāmovi muṭṭi nelaṁṭe
kŏmmamāḍagu nā movi guṟi yanīne
simmi kānuga liyyam̐gā sĕyyāla paṭṭe vaṁṭe
vummaḍi nābĕgāniga kŏḍigaṭṭĕ nanīne
(||iḍuvaṁṭi||)
dūdiganai mŏkke nāduru mela paṭṭe vaṁṭe
rīdi nābĕmŏkkule dhariṁche nanīve
nādim̐ jĕnagam̐ bilisĕ, nā marmame laṁṭe vaṁṭe
yedula nābĕmarmāle yīḍa nunna nanīne
(||iḍuvaṁṭi||)
pūḍiga middarigini vŏsaram̐ bānpu veside
veḍuga nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍe
joḍugām̐ gūḍe vāgĕgu suddi sĕppi vachche naṁṭe
jāḍadom̐ dānĕ suddulu sagiyagum̐ jĕppīne