ఇటువంటి వేడుకలు యిదే నీకుఁ గలిగెను
(॥పల్లవి॥)
ఇటువంటి వేడుకలు యిదే నీకుఁ గలిగెను
తటుకన వరమిచ్చి దయసేయవయ్యా
(॥ఇటు॥)
కలికి చూపులు నీకు కలువలదండలాయ
సెలవినవ్వులు మంచిసేవంతులాయ
పిలిచిన యధరము పెనుమంకెనవూవాయ
కొలఁది భారము నిండుఁ బూజలాయను
(॥ఇటు॥)
ముక్కు నిట్టూర్పులు నీకు మొనసి సంపెఁగలాయ
తక్కక చేసన్నలు తామరలాయ
చెక్కుమీఁది పులకలు చెలరేఁగి జాజులాయ
నెక్కొన్న యీపె చందము నీకుఁ బూజలాయను
(॥ఇటు॥)
మచ్చిక నీపెకాఁగిలి మరువపు ననలాయ
కొచ్చి కాఁగిటిరతులు కురివేరాయ
యిచ్చట శ్రీవేంకటేశ యింతి నీవూఁ గూడఁగాను
పచ్చిదేరి యిన్నిటాను బలు పూజలాయను
(||pallavi||)
iḍuvaṁṭi veḍugalu yide nīgum̐ galigĕnu
taḍugana varamichchi dayaseyavayyā
(||iḍu||)
kaligi sūbulu nīgu kaluvaladaṁḍalāya
sĕlavinavvulu maṁchisevaṁtulāya
pilisina yadharamu pĕnumaṁkĕnavūvāya
kŏlam̐di bhāramu niṁḍum̐ būjalāyanu
(||iḍu||)
mukku niṭṭūrbulu nīgu mŏnasi saṁpĕm̐galāya
takkaga sesannalu tāmaralāya
sĕkkumīm̐di pulagalu sĕlarem̐gi jājulāya
nĕkkŏnna yībĕ saṁdamu nīgum̐ būjalāyanu
(||iḍu||)
machchiga nībĕgām̐gili maruvabu nanalāya
kŏchchi kām̐giḍiradulu kuriverāya
yichchaḍa śhrīveṁkaḍeśha yiṁti nīvūm̐ gūḍam̐gānu
pachchideri yinniḍānu balu pūjalāyanu