ఇటువంటి వేడుక లెవ్వరికిఁ గలవమ్మ
(॥పల్లవి॥)
ఇటువంటి వేడుక లెవ్వరికిఁ గలవమ్మ
తటుకన మఱచేరు తమలోనే మేనులు
(॥॥)
కలికి రమణునికిఁ గస్తూరినామముపెట్టి
చెలరేఁగి తాఁజూపెఁ జెక్కుటద్దాలు
ములువాఁడి కొనగొళ్లు ముంచి కొప్పు దువ్విదువ్వి
తొలసితో మొల్లలట్టే తురిమీఁ జూపులను
(॥॥)
పడఁతి విభునిమీఁద బన్నీరు చిలికించి
తడియొత్తీఁ గుచముల తగుపొట్లాల
చిడుముడి సొమ్ములతో సింగారములు సేసి
ఆడరి నివాళించీ నంగపుఁ గాంతులను
(॥॥)
సోవగాఁ బీతాంబరము చుంగులువారఁ గట్టి
మోవి యాని తమ్ముల మిమ్ములఁ బెట్టెను
ఆవేళ శ్రీవేంకటేశు నట్టె మోహించి చూచి
తానిమంచానకుఁ దీసి తమకించి కూడెను
(||pallavi||)
iḍuvaṁṭi veḍuga lĕvvarigim̐ galavamma
taḍugana maṟaseru tamalone menulu
(||||)
kaligi ramaṇunigim̐ gastūrināmamubĕṭṭi
sĕlarem̐gi tām̐jūbĕm̐ jĕkkuḍaddālu
muluvām̐ḍi kŏnagŏḽlu muṁchi kŏppu duvviduvvi
tŏlasido mŏllalaṭṭe turimīm̐ jūbulanu
(||||)
paḍam̐ti vibhunimīm̐da bannīru siligiṁchi
taḍiyŏttīm̐ gusamula tagubŏṭlāla
siḍumuḍi sŏmmulado siṁgāramulu sesi
āḍari nivāḽiṁchī naṁgabum̐ gāṁtulanu
(||||)
sovagām̐ bīdāṁbaramu suṁguluvāram̐ gaṭṭi
movi yāni tammula mimmulam̐ bĕṭṭĕnu
āveḽa śhrīveṁkaḍeśhu naṭṭĕ mohiṁchi sūsi
tānimaṁchānagum̐ dīsi tamagiṁchi kūḍĕnu