ఇటువంటి వాఁడవుత యెఱఁగమమ్మా నేము
(॥పల్లవి॥)
ఇటువంటి వాఁడవుత యెఱఁగమమ్మా నేము
నటియించి మన్ననలు నాకు నిచ్చీ నితఁడు
(॥యిటు॥)
యింత బత్తే కలిగితే నింటికి రావలెఁగాక
సంత వలపులు మీఁదఁ జల్ల నేఁటికే
వింతవారెల్లాఁజాడఁగా విడె మియ్య వచ్చీని
కాంతనైతినే నన్నుఁ గాకు సేతు రటవే
(॥యిటు॥)
మిక్కిలి చుట్టమైతేను మేలమాడవలెఁగాక
మిక్కుటపు నవ్వు నవ్వి మీర నేఁటికి
పక్కనఁ గొలువులోన పయ్యదకొంగువట్టీని
చక్కనిదాననైతేనే చండి సేతు రటవే
(॥యిటు॥)
కూడ వేడుకైతేను గుట్టు సేయవలెఁగాక
యెడనైనాఁ జెనకీని యిది యేఁటికే
వేడుకతో నన్నేలి శ్రీవేంకటేశుఁడు చొక్కీని
యీడైనదాననైతేనే ఇంత సేతు రటవే
(||pallavi||)
iḍuvaṁṭi vām̐ḍavuda yĕṟam̐gamammā nemu
naḍiyiṁchi mannanalu nāgu nichchī nidam̐ḍu
(||yiḍu||)
yiṁta batte kaligide niṁṭigi rāvalĕm̐gāga
saṁta valabulu mīm̐dam̐ jalla nem̐ṭige
viṁtavārĕllām̐jāḍam̐gā viḍĕ miyya vachchīni
kāṁtanaidine nannum̐ gāgu sedu raḍave
(||yiḍu||)
mikkili suṭṭamaidenu melamāḍavalĕm̐gāga
mikkuḍabu navvu navvi mīra nem̐ṭigi
pakkanam̐ gŏluvulona payyadagŏṁguvaṭṭīni
sakkanidānanaidene saṁḍi sedu raḍave
(||yiḍu||)
kūḍa veḍugaidenu guṭṭu seyavalĕm̐gāga
yĕḍanainām̐ jĕnagīni yidi yem̐ṭige
veḍugado nanneli śhrīveṁkaḍeśhum̐ḍu sŏkkīni
yīḍainadānanaidene iṁta sedu raḍave