ఇటువంటి తగవులే యెక్కడ చూచినను
(॥పల్లవి॥)
ఇటువంటి తగవులే యెక్కడ చూచినను
నటనలు బూమిలోన నడచీనయ్యా
(॥ఇటు॥)
కన్నుల నవ్వినందుకు కాఁతాళించే వేమయ్య
యెన్ని కెగాఁ దిట్టితే నీ వేమి నేతువో
వున్నతి నెవ్వరుఁ దమ వొళ్లికల్ల చూచుకోరు
యిన్నిటాఁ దమ్ము సోఁకితే యెగ్గు పట్టఁ జూతురు
(॥ఇటు॥)
పైకొని మాటాడితేనె పగ చాటే వేమయ్య
యీకడ చెత నంటితే యేమి సేతువో
ఆకడఁ దమచేఁతలు అందము లనుకొందురు
లోకు లవి గాదంటే లోఁచి నా దడుతురు
(॥ఇటు॥)
మొక్కి మొకము చూచితే మొరయుచు జంకించేవు
యిక్కువ గోర గీరితే నేమి సేతువో
మక్కువ శ్రీవెంకటేశ మంచివాఁడ వై కూడితి
తక్కక వా రిది గంటే దంటవు నీ వందురు
(||pallavi||)
iḍuvaṁṭi tagavule yĕkkaḍa sūsinanu
naḍanalu būmilona naḍasīnayyā
(||iḍu||)
kannula navvinaṁdugu kām̐tāḽiṁche vemayya
yĕnni kĕgām̐ diṭṭide nī vemi neduvo
vunnadi nĕvvarum̐ dama vŏḽligalla sūsugoru
yinniḍām̐ dammu som̐kide yĕggu paṭṭam̐ jūduru
(||iḍu||)
paigŏni māḍāḍidenĕ paga sāḍe vemayya
yīgaḍa sĕda naṁṭide yemi seduvo
āgaḍam̐ damasem̐talu aṁdamu lanugŏṁduru
logu lavi gādaṁṭe lom̐si nā daḍuduru
(||iḍu||)
mŏkki mŏgamu sūside mŏrayusu jaṁkiṁchevu
yikkuva gora gīride nemi seduvo
makkuva śhrīvĕṁkaḍeśha maṁchivām̐ḍa vai kūḍidi
takkaga vā ridi gaṁṭe daṁṭavu nī vaṁduru